దర్శకధీరుడి నుంచి వచ్చిన 'బాహుబలి' చిత్రాల క్రేజ్ పుణ్యామా అని ప్రతి చిత్రసీమ పాన్ ఇండియా సినిమాల వైపు దృష్టి సారించడం షురూ చేసింది. కన్నడ నుంచి వచ్చిన 'కేజీఎఫ్', తమిళనాట నుంచి వచ్చిన '2.ఓ', తెలుగు నుంచి దూసుకొచ్చిన 'సాహో', 'సైరా'.. చిత్రాలు పాన్ ఇండియా ట్యాగ్ లైన్‌తోనే విడుదలై సినీప్రియులను అలరించాయి. ఇప్పుడు మహేశ్ బాబు కూడా దీనిపై దృష్టి పెట్టబోతున్నాడు.
మహేశ్.. బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం..!
'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మహేశ్ బాబు ఓ సినిమా చేయనున్నాడని సమాచారం. దీనిని పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించాలని ప్రశాంత్‌కు సూచించాడట సూపర్‌స్టార్.
మహేశ్ బాబు ప్రస్తుతం 'సరిలేరు నీకెవ్వరు'తో బిజీగా ఉన్నాడు. అనంతరం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించబోతున్నాడని సమాచారం. 'కేజీఎఫ్'తో సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్. ఆ చిత్రం బాలీవుడ్‌లో మంచి వసూళ్లు అందుకుంది. ఈ కారణంగా ప్రశాంత్‌తో తీసే సినిమాను బాలీవుడ్‌లోనూ విడుదల చేయాలన్నది మహేశ్ ప్లాన్. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోకి ఎలాగూ ఈ సినిమా వెళ్తుంది. ఈ విధంగా పాన్ ఇండియా ఇమేజ్ దక్కుతుంది. అన్ని భాషల సినీ అభిమానుల అభిరుచులకు తగ్గట్టుగానే కథ ఉండాలని మహేశ్ సూచించాడని, ప్రశాంత్ నీల్ అలాంటి కథే తయారు చేస్తున్నాడని సమాచారం. అతి త్వరలోనే ఈ కాంబినేషన్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఇవీ చూడండి.. నిర్మాతగా మారబోతున్న యంగ్ టైగర్..!