సూపర్‌స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) కథానాయకుడిగా నటిస్తున్న 'సర్కారు వారి పాట'(Sarkaru Vaari Paata) చిత్రీకరణ వచ్చే నెల తొలి వారంలో పునః ప్రారంభం అవుతుంది. ఏప్రిల్‌లో రెండో షెడ్యూల్ చిత్రీకరణను మొదలు పెట్టగానే, రెండో దశ కరోనా ఉద్ధృతితో ఆగిపోయింది. కొన్ని నెలల విరామం తర్వాత మళ్లీ చిత్రబృందం రంగంలోకి దిగుతోంది. ఈసారి హైదరాబాద్‌లోనే కీలక సన్నివేశాల్ని తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేశారు.
Sarkaru Vaari Paata: జులై నుంచి హైదరాబాద్‌లో..! - మహేశ్‌బాబు
మహేశ్ బాబు(Mahesh Babu) నటిస్తున్న 'సర్కారు వారి పాట'(Sarkaru Vaari Paata) రెండో షెడ్యూల్ షూటింగ్ జులైలో పునఃప్రారంభం కానుంది. ఈ సారి హైదరాబాద్‌లోనే కీలక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు.
సర్కారు వారి పాట
మహేశ్, కీర్తిసురేష్ జంటగా నటిస్తున్న ఈ సినిమాను పరశురామ్ తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జి.ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దుబాయ్‌లో తొలి షెడ్యూల్ చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి లక్ష్యంగా సెట్స్‌పైకి వెళ్లింది. వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
ఇదీ చూడండి: వాళ్లు చూడ్డానికే అలా ఉంటారు: సుబ్బరాజు