లాక్‌డౌన్ కారణంగా ఏడు నెలల పాడు దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లు మూతపడ్డాయి. దీంతో సినిమా రంగంలో సందడి తగ్గింది. అయితే అన్‌లాక్ నిబంధనల్లో భాగంగా అక్టోబర్ 15వ తేదీ నుంచి 50 శాతం సీట్లను భర్తీ చేస్తూ సినిమాహాళ్లు తెరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రేక్షకులు తిరిగి థియేటర్లకు వచ్చేలా లాక్‌డౌన్‌కు ముందు ప్రేక్షకుల్ని అలరించిన పలు సూపర్‌హిట్ చిత్రాలను మరోసారి విడుదల చేయనున్నారు.
మళ్లీ థియేటర్లలోకి మహేశ్ సినిమా.. రేసులో నితిన్, బన్నీ - అల్లు అర్జున్ అల వైకుంఠపురములో
థియేటర్ల తెరుచుకున్న సందర్భంగా తమిళనాడులో తొలుత మహేశ్‌బాబు 'సరిలేరు నీకెవ్వరు' డబ్బింగ్ వెర్షన్‌ను ప్రదర్శించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సినిమా హాళ్లు తెరుచుకునే తేదీపై ఇంకా స్పష్టత రాలేదు.
థియేటర్లలోకి మహేశ్ సినిమా.. రేసులో నితిన్, బన్నీ
థియేటర్లు ఓపెన్ కాగానే.. మహేశ్‌బాబు సూపర్‌హిట్ 'సరిలేరు నీకెవ్వరు'(తమిళ డబ్బింగ్) చిత్రాన్ని చెన్నైలో మొదటి సినిమాగా ప్రదర్శించనున్నారు. మరోవైపు నితిన్ 'భీష్మ', అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' సినిమాలనూ బెంగళూరులోని పలు థియేటర్లలో స్ర్కీనింగ్ చేయనున్నారు. ఈ మేరకు ఆన్‌లైన్‌లో టికెట్ బుకింగ్‌లు కూడా ప్రారంభించారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పునః ప్రారంభంపై ఇంకా స్పష్టత రాలేదు.