తెలంగాణ

telangana

ETV Bharat / sitara

యూట్యూబ్​ దుమ్ముదులుపుతున్న 'సరిలేరు నీకెవ్వరు' - మహేశ్​ బాబు లేటేస్ట్​ సినిమా అప్​డేట్స్​

హీరో మహేశ్​బాబు 'సరిలేరు నీకెవ్వరు' టీజర్​ విడుదలైన కొద్ది నిమిషాల్లోనే మిలియన్​ వ్యూస్​ సొంతం చేసుకుంది. యూట్యూబ్​ ఇండియా ట్రెండింగ్​లో మొదటి స్థానంలో కొనసాగుతోంది.

యూట్యూబ్​లో 'సరిలేరు నీకెవ్వరు'

By

Published : Nov 23, 2019, 12:40 PM IST

సూపర్​ స్టార్​ మహేశ్​బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' టీజర్​ యూట్యూబ్​లో​ రికార్డులను సృష్టిస్తోంది. విడుదలైన 9 నిమిషాల్లోనే 1 మిలియన్​ రియల్​ టైం వ్యూస్ అందుకుంది.​ ప్రస్తుతం 1.2 కోట్ల వ్యూస్​తో యూట్యూబ్​ ఇండియా ట్రెండింగ్​లో మొదటి స్థానంలో కొనసాగుతోంది.

ఇందులో మహేశ్​ చెప్పిన 'మన దగ్గర బేరాల్లేవమ్మా..' అనే డైలాగ్ ప్రేక్షకుల చేత విజిల్స్​ వేయిస్తోంది. ఆర్మీ నేపథ్య కథాంశంతో సాగే ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

'సరిలేరు నీకెవ్వరు' టీజర్‌ అద్భుతంగా ఉందని పలువురు సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. మహేశ్‌ డైలాగ్స్ అదిరిపోయాయని, విజయశాంతి నటన అద్భుతంగా ఉందని అంటున్నారు. మహేశ్‌ను చాలా కాలం తర్వాత సరికొత్త లుక్​లో చూశామని చెబుతున్నారు.

యూట్యూబ్​లో 'సరిలేరు నీకెవ్వరు'

ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్. ప్రకాశ్​రాజ్​, విజయశాంతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించాడు. అనిల్​ రావిపుడి దర్శకుడు. దిల్‌రాజు, అనిల్ సుంకర, మహేశ్‌బాబు సంయుక్తంగా నిర్మించారు.

ఇవి కూడా చదవండి:​​​​​​​'సరిలేరు నీకెవ్వరూ' నుంచి మరో సర్​ప్రైజ్​

ABOUT THE AUTHOR

...view details