టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన సినిమా 'మహర్షి'. తాజాగా విజయవాడలో విజయోత్సవాన్ని జరుపుకొంది. ఈ సినిమాను ఉద్దేశిస్తూ కథానాయకుడు మహేష్ బాబు ఓ ట్వీట్ చేశాడు. "వంశీ.. నేను గర్వపడేలా నా 25వ సినిమాను తీర్చిదిద్దినందుకు కృతజ్ఞతలు. నేను తప్ప ఈ సినిమా ఇంకెవ్వరూ చెయ్యలేరన్న నీ మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. సోదరా... ఇప్పటివరకు నాకు దక్కిన అతి పెద్ద ప్రశంస ఇదే." అంటూ ట్వీట్ చేశాడు.
ఆ మాటలు ఎప్పటికీ గుర్తుంచుకుంటా: మహేశ్ - maharshi
'మహర్షి' సినిమా విజయం పట్ల దర్శకుడు వంశీ పైడిపల్లి.. హీరో మహేశ్ బాబు ఒకరికొకరు ట్విట్టర్లో ధన్యవాదాలు తెలుపుకున్నారు.
మహర్షి
ఈ ట్వీట్‌కు వంశీ స్పందిస్తూ... "మీ నమ్మకం, ప్రేమ, గౌరవం, ప్రోత్సాహమే నన్ను, మహర్షి కోసం పనిచేసిన చిత్ర బృంద సభ్యులను నడిపించింది. నా కృతజ్ఞతలు మాటల్లో తెలపలేను. ధన్యవాదాలు సోదరా" అని అన్నాడు.
ఇవీ చూడండి.. హే బంటీ.. నీ సబ్బు స్లోనా ఏంటీ...?