తెలంగాణ

telangana

ETV Bharat / sitara

త్రివిక్రమ్ చిత్రంలో మహేష్​ పాత్ర అదేనా? - మహేష్ బాబు పార్థు

సూపర్​స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. అయితే ఇందులో ప్రిన్స్​.. అండర్ కవర్ పోలీస్​గా కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

Maheshbabu
మహేష్

By

Published : Jun 4, 2021, 6:26 AM IST

'సర్కారు వారి పాట' పూర్తయ్యాక మహేష్‌బాబు(Mahesh Babu), త్రివిక్రమ్‌(Trivikram)ల కలయికలో ఓ సినిమా రూపొందనుంది. 'అతడు', 'ఖలేజా' వంటి హిట్ల తర్వాత ఈ కలయికలో రానున్న మూడో చిత్రమిది. గత నెలలోనే లాంఛనంగా ప్రారంభం కావాల్సిన ఈ సినిమా.. కొవిడ్‌ పరిస్థితుల వల్ల వాయిదా పడింది. అయితే ఇప్పుడీ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త బయటకొచ్చింది.

ఈ సినిమాలో మహేష్‌ 'రా' ఏజెంట్‌గా కనిపించనున్నట్లు నిన్నమొన్నటి వరకు వార్తలొచ్చాయి. కానీ, ఆయన ఇందులో అండర్‌ కవర్‌ పోలీస్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ పనులు వేగంగా జరుగుతున్నాయని, 'సర్కారు వారి పాట' పూర్తి కాగానే ఈ చిత్రం పట్టాలెక్కించనున్నారని సమాచారం. దీని కోసం 'పార్థు' అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. కథానాయికగా పూజా హెగ్డేను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గతంలో మహేష్‌ 'పోకిరి', 'దూకుడు', 'ఆగడు' చిత్రాల్లో పోలీస్‌గా కనిపించారు.

ఇవీ చూడండి: మహేశ్​-త్రివిక్రమ్​ సినిమాలో 'వకీల్​సాబ్​' భామ!

ABOUT THE AUTHOR

...view details