సూపర్‌స్టార్ కృష్ణ కెరీర్లో మర్చిపోలేని చిత్రం 'అల్లూరి సీతారామరాజు'. 1974లో వచ్చిన ఈ సినిమా ఎన్నో అవార్డులు సొంతం చేసుకుని, ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. అయితే దీని గురించి ఇప్పుడెందుకు మాట్లాడుతున్నామని అనుకుంటున్నారా. మరేం లేదు.. అల్లూరి వేషధారణలో మహేశ్‌బాబును చూడాలనేది చాలా మంది అభిమానుల కోరిక. భవిష్యత్తులో అది జరగొచ్చు, జరగకపోవచ్చు. కానీ బాలనటుడిగా మహేశ్.. ఈ గెటప్ వేసుకుని అలరించాడు. ఆ సినిమా విడుదలై నేటికి 31 ఏళ్లు పూర్తయింది.
అల్లూరి గెటప్‌లో హీరో మహేశ్‌బాబు - mahesh babu age
అల్లూరి సీతారామరాజు గెటప్‌లో మహేశ్‌బాబు కనిపించిన 'ముగ్గురు కొడుకులు' సినిమా విడుదలై నేటికి 31 ఏళ్లు పూర్తయింది.
ఆ కథ ఇది..!
కృష్ణ హీరోగా నటించిన 'ముగ్గురు కొడుకులు' చిత్రంలో.. ఆయన కుమారులు రమేశ్ బాబు, మహేశ్‌బాబు కీలక పాత్రల్లో నటించారు. ఆ సినిమాలోని ఓ సందర్భంలో మహేశ్‌బాబు అల్లూరి వేషధారణలో అలరిస్తాడు.
ప్రస్తుతం 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో బిజీగా ఉన్నాడు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. రష్మిక హీరోయిన్. విజయశాంతి కీలక పాత్రధారి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకుడు. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.