తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మహేశ్ కోసం వేయి కళ్లతో చూస్తున్నా' - నమ్రత

ప్రిన్స్​ మహేశ్‌బాబు ‘మహర్షి’ సినిమా చిత్రీకరణలోని కొన్ని ఫొటోలు షేర్​ చేశాడు. ఈ చిత్రాల్లో మహేశ్​ మరింత హ్యాండ్సమ్​గా కనిపిస్తున్నాడు.

'మహేశ్ కోసం వేయి కళ్లతో చూస్తున్నా'

By

Published : Mar 9, 2019, 6:42 PM IST

'మహర్షి'లో మహేశ్​ పాత్ర ఏంటి? సినిమా నేపథ్యం ఏంటి? ప్రిన్స్​​ అభిమానులు అందరిదీ ఇదే ఆలోచన. అలాంటి వారికోసం వర్కింగ్​ స్టిల్స్​ రిలీజ్​ చేసింది చిత్ర బృందం. ‘వృత్తిపట్ల ఎంతో నిబద్ధతతో శ్రమించే ‘మహర్షి’ చిత్ర బృందంతో షూటింగ్‌ విరామంలో దిగిన ఫొటోలు’ అంటూ కామెంట్​ చేశాడు టాలీవుడ్​ సూపర్​ స్టార్​.

షూటింగ్​లోని ఒక దృశ్యం
'మహర్షి’ సినిమా చిత్రీకరణ

‘బెస్ట్‌ ఈజ్‌ ఎట్‌ టు కమ్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ జోడించాడు. ఫొటోలు చూస్తే పల్లెటూరి వాతావరణంలో సినిమా సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నట్టు ఉంది.

ప్రిన్స్​, వంశీ పైడిపల్లి

కుమారుడు గౌతమ్‌తో కలిసి దిగిన ఫొటోను నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో నెటిజన్లతో పంచుకున్నారు. సినిమాలోని సన్నివేశాలు బాగా నచ్చాయని అన్నారు. కంప్యూటర్‌ తెరపైనే ఇంత బాగుంటే.. వెండితెరపై ఇంకెంత బాగుంటుందో అని వ్యాఖ్యానించారు. సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నట్లు ఆమె చెప్పారు.

నమ్రతా ఇన్​స్టా పోస్టు

‘మహర్షి’ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. అల్లరి నరేష్‌ కీలక పాత్రలో కనిపించనున్నాడు. డీఎస్​పీ బాణీలు సమకూర్చాడు. ఇటీవలే సినిమా విడుదలను ఏప్రిల్‌ 25 నుంచి మే 9వ తేదీకి వాయిదా వేశారు.

ABOUT THE AUTHOR

...view details