మహేశ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహర్షి చిత్రం నేడుప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో పూజాహేగ్డె కథానాయిక. వంశీ పైడిపల్లి దర్శకుడు. అల్లరి నరేశ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్వినిదత్ నిర్మిస్తున్నారు.
నేడు మహర్షి మీ ముందుకొస్తున్నాడు...! - ,ahesh
సూపర్‌స్టార్ మహేశ్ నటించిన మహర్షి చిత్రం నేడు విడుదల కానుంది. పూజాహెగ్డే హీరోయిన్. అల్లరి నరేశ్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు.
మహర్షి
ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించిన ఈ సినిమా మహేశ్ 25వ చిత్రం. ఈ సినిమాలో మూడు రకాల పాత్రల్లో మెరిశాడు ప్రిన్స్. ఇప్పటికే మహేశ్ లుక్స్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాయి.
అశ్విని దత్ నిర్మించిన జగదేక వీరుడు అతిలోక సుందరి, మహానటి సినిమాలు కూడా మే 9నే విడుదలై అద్భుత విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇదే తరహాలో మహర్షి సినిమా కూడా ఘన విజయం సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.