తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మహర్షి ప్రీ రిలీజ్​కు వచ్చే స్టార్​ ఎవరు? - జూనియర్ ఎన్టీఆర్

టాలీవుడ్​ సూపర్​స్టార్​ మహేశ్​ బాబు నటించిన 'మహర్షి' చిత్రం ప్రచారాలతో దూసుకెళ్తోంది. మే 1న ప్రీ రిలీజ్​ వేడుక నిర్వహించనుంది చిత్రబృందం. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ స్టార్​ హీరోలలో ఒకరు హాజరుకావొచ్చని వార్తలు వస్తున్నాయి.

మహర్షి ప్రీ రిలీజ్​కు వచ్చే స్టార్​ ఎవరు..??

By

Published : Apr 25, 2019, 2:05 PM IST

ప్రిన్స్​ మహేశ్ బాబు, పూజాహెగ్డే నటించిన తాజా చిత్రం 'మహర్షి'. ఈ సినిమా ప్రీ రిలీజ్​ వేడుక హైదరాబాద్ నెక్లెస్​రోడ్​లోని పీపుల్స్ ప్లాజాలో మే 1న నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి జూ.ఎన్టీఆర్​, రామ్​చరణ్​లో ఎవరో ఒకరు హాజరవుతారని సమాచారం. గతంలో మ‌హేష్​బాబు నటించిన సూపర్​హిట్​ సినిమా 'భ‌ర‌త్ అనే నేను' ప్రీ రిలీజ్ వేడుక‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు తారక్​.

'భరత్​ అను నేను' ప్రీరిలీజ్​ వేడుకలో ప్రిన్స్​, తారక్​

ఇటీవల 'మహర్షి' దర్శకుడు వంశీ పైడిపల్లి జన్మదిన వేడకలో ఈ ముగ్గురు స్టార్లు కనువిందు చేశారు. మహేశ్​బాబు 25వ చిత్రం కావడం వల్ల.. ఈ కార్యక్రమానికి మహేశ్‌తో ఇప్పటివరకు పనిచేసిన 24 సినిమాల దర్శకుల‌ను ఆహ్వానించ‌నున్నట్లు తెలుస్తోంది.

వంశీ పైడిపల్లి జన్మదిన వేడకలో ముగ్గురు స్టార్లు

మే 9న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల కానుంది. అల్ల‌రి న‌రేష్ కీలక పాత్రలో నటించగా.. దేవిశ్రీ ప్రసాద్​ సంగీతం అందించాడు.

ABOUT THE AUTHOR

...view details