మే 9న విడుదలై మంచి కలెక్షన్లతో దూసుకెళ్తోంది 'మహర్షి'. బుధవారం హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌ను చిత్రయూనిట్ సందర్శించింది. అభిమానులతో కాసేపు ముచ్చటించారు మహేశ్. గ్రూప్ ఫొటోను షేర్ చేసింది నిర్మాణ సంస్థ ఎస్వీ క్రియేషన్స్. బాక్సాఫీసు దగ్గర విశేషమైన వసూళ్లు రాబట్టడమే కాకుండా సందేశాత్మక చిత్రంగా ప్రశంసలు పొందుతోంది.
సుదర్శన్‌లో సూపర్‌స్టార్ హంగామా - మహర్షి చిత్రబృందం
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, పూజాహెగ్డే నటించిన చిత్రం 'మహర్షి'. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌ను సందర్శించింది చిత్రబృందం.
సుదర్శన్‌లో సూపర్‌స్టార్ హంగామా
మహర్షి’ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు. పూజా హెగ్డే కథానాయిక. అల్లరి నరేష్ కీలక పాత్రలో కనిపించారు. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు సమకూర్చాడు. దిల్‌రాజు, ప్రసాద్ వి పొట్లూరి, అశ్విని దత్ నిర్మాతలుగా వ్యవహరించారు.