తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మాధవన్​కు 18 ఏళ్ల అమ్మాయి ప్రపోజల్​ - anushka

దక్షిణాది నటుడు మాధవన్​కు 18 ఏళ్ల మహిళా అభిమాని నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. 'మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా' అని నెట్టింట ప్రపోజల్​ పెట్టింది.

మాధవన్​కు 18 ఏళ్ల అమ్మాయి ప్రపోజల్​

By

Published : Jul 26, 2019, 11:21 AM IST

మాధవన్‌, సిమ్రన్‌ జంటగా నటిస్తోన్న చిత్రం 'రాకెట్రీ: ద నంబీ ఎఫెక్ట్​'. ఈ సినిమా విశేషాలను పంచుకొంటూ మంగళవారం ఇన్​స్టాలో ఓ ఫొటో షేర్​ చేశాడీ స్టార్​ హీరో. దానికి కామెంట్​గా ఓ యువతి నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది.

"ఎడిటింగ్‌ చాలా కష్టంతో కూడుకున్న పని. మరోపక్క ఫన్నీగానూ ఉంటుంది. రోజంతా ప్రయాణం చేసొచ్చాను. నేను వృద్ధుడిని అయిపోతున్నాను".
-- మాధవన్​, సినీ నటుడు

ఈ ఫొటోపై నైనా అనే నెటిజన్‌ కామెంట్‌ చేస్తూ... "నాకు 18 ఏళ్ల వయసు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకొంటున్నా. ఇది తప్పా..?" అని ప్రశ్నించింది. దానికి స్పందించిన హీరో... " గాడ్‌ బ్లెస్‌ యూ. నాకంటే మెరుగైన వ్యక్తి మీకు తప్పకుండా దొరుకుతాడు" అని నవ్వుతూ సమాధానమిచ్చాడు.

మాధవన్​ పోస్ట్​కు అమ్మాయి ప్రపోజల్​

ఈ విషయంపై అర్జున్​ రెడ్డి నటి షాలిని పాండే కూడా స్పందించింది. " మీ వయసు పెరుగుతుంటే బాధగా ఉంది. కాని మీ నటన కోసం ఆతృతగా చూస్తున్నాం" అని చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ. శిల్పాశెట్టి భర్త రాజ్​ కుంద్రా అయితే "ఇంకా ఫెయిర్​ అండ్ హ్యాండ్సమ్ వాడుతున్నావా" అని కామెంట్ పెట్టాడు.

ప్రముఖ మాజీ ఇస్రో శాస్త్రవేత్త 'నంబి నారాయణన్‌' జీవితం ఆధారంగా 'రాకెట్రీ' చిత్రం తెరకెక్కుతోంది. జాతీయ అవార్డు గ్రహీత అనంత్‌ మహదేవన్‌తో కలిసి సంయుక్తంగా దర్శకత్వ బాధ్యతలూ చేపట్టాడు మాధవన్​. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది. దీనితో 'నిశ్శబ్ధం' అనే చిత్రంలో అనుష్కకు జోడీగా నటిస్తున్నాడు.

ABOUT THE AUTHOR

...view details