తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ తెలుగు చిత్రంలో నటించట్లేదు! - లింగుస్వామి మాధవన్

రామ్ పోతినేని (Ram Pothineni), కృతిశెట్టి ప్రధానపాత్రల్లో లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందబోతుంది. ఈ చిత్రంలో మాధవన్ కీలక పాత్ర పోషించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై స్పందించారు మాధవన్(R. Madhavan).

madhavan
మాధవన్

By

Published : Jun 12, 2021, 4:37 PM IST

రామ్‌ పోతినేని(Ram Pothineni), కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీనివాస సిల్వర్ స్ర్కీన్‌ పతాకంపై ఈ చిత్రం రూపొందనుంది. RAPO19 వర్కింగ్‌ టైటిల్‌తో పవన్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఇందులో రామ్‌ పవర్‌పుల్‌ పోలీస్‌ అధికారి పాత్రలో కనిపించనున్నారు. తెలుగు, తమిళం.. రెండు భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూర్చనున్నారు.

అయితే కొన్ని రోజులుగా తమిళ నటుడు మాధవన్‌(R. Madhavan) ఈ చిత్రంలో విలన్‌గా నటించనున్నారనే వార్తలు చక్కర్లు కొట్టగా.. వాటిని ఖండిస్తూ శనివారం నటుడు మాధవన్‌ ట్వీట్‌ చేశారు. "దర్శకుడు లింగుస్వామితో పనిచేయడాన్ని నేను ప్రేమిస్తాను.. ఎందుకంటే ఆయనొక చక్కటి వ్యక్తి. కానీ, ఇటీవల తెలుగులో నేను విలన్‌గా నటస్తున్నట్టు వచ్చిన వార్తలో ఎలాంటి నిజం లేదు" అంటూ స్పష్టం చేశారు. కాగా మాధవన్‌ గతంలో లింగుస్వామి దర్శకత్వంలో 'వెట్టాయి' చిత్రంలో నటించారు.

ఇవీ చూడండి: విశాల్‌ కేసుపై నిర్మాత స్పందన

ABOUT THE AUTHOR

...view details