రాజశేఖర్ మాట్లాడిన తీరుకు నేను క్షమాపణ చెబుతున్నా: జీవిత
'మా'లో సమస్యలను అందరం కలిసి పరిష్కరించుకుందాం: జీవిత
లోపాలు ఉంటే 'మా'లో మాట్లాడుకుందాం... బయటకు తీసుకురాకూడదు: జీవిత
అందరం కలిసి సమస్యలు పరిష్కరించుకునేందుకే నేను,
రాజశేఖర్ కృషి చేస్తున్నాం: జీవిత
మా సమావేశంలో చిరు-రాజశేఖర్ మాటల 'వార్' - చిరంజీవి
13:40 January 02
రాజశేఖర్ మాట్లాడిన తీరుకు నేను క్షమాపణ చెబుతున్నా: జీవిత
13:34 January 02
మా సమావేశంలో చిరు-రాజశేఖర్ మాటల 'వార్'
మా మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్‌లో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. నూతన సంవత్సర 'మా' డైరీ ఆవిష్కరణ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశానికి చిరంజీవి, మోహన్ బాబు, సుబ్బరామిరెడ్డి, కృష్ణంరాజు, మురళీమోహన్, జయసుధతో పాటు.. 'మా' బాధ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా.. అసోసియేషన్‌లో ఉన్న లుకలుకలపై.. మా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు రాజశేఖర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
"'మా' ఎగ్జిక్యూటివ్ సభ్యుల్లో చీలికలు ఉన్నాయి. అసోసియేషన్‌లో జరిగే విషయాలను కప్పిపుచ్చే వ్యవహారం జరుగుతుంది. మార్చి నెలలో 'మా' కొత్త కార్యవర్గం ఏర్పాటైంది. అప్పటినుంచి నేను సినిమాలు చేయలేదు. మా ఇంట్లో కూడా చాలా సమస్యలు ఎదురయ్యాయి. 'మా' అసోసియేషన్ తగాదాల వల్లే కారు కూడా పోగొట్టుకున్నా. మమ్మల్ని కలిసి ఉండాలని చిరంజీవి కోరారు. మా అసోసియేషన్‌లో నిప్పును కప్పి ఉంచితే పొగ రాకుండా ఉండదు."
-రాజశేఖర్, మా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు
రాజశేఖర్ వ్యాఖ్యలను చిరంజీవి తీవ్రంగా తప్పుబట్టాడు. బహిరంగంగా ఇలా మాట్లాడడాన్ని ఖండిస్తున్నానని అన్నారు. ఇదంతా కావాలని ప్లాన్ చేసిన కుట్రగా చెప్పాడు. ఈ విషయంలో క్రమశిక్షణ కమిటీ కఠిన చర్యలు తీసుకోవాలన్నాడు.
అనంతరం.. కృష్ణంరాజు మాట్లాడాడు. 'మా' లో ప్రత్యేక కమిటీ వేస్తామని.. సమస్యలు, అసంతృప్తులు ఉంటే కమిటీ ఎదుట మాత్రమే చెప్పాలని స్పష్టం చేశాడు.
12:57 January 02
'మా' అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రసాభాస
- 'మా' అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రసాభాస
- 'మా' ఎగ్జిక్యూటివ్ సభ్యుల్లో చీలికలు ఉన్నాయన్న నటుడు రాజశేఖర్
- అసోసియేషన్‌లో జరిగే విషయాలను కప్పిపుచ్చే వ్యవహారం జరుగుతుందని వ్యాఖ్య
- మార్చి నెలలో 'మా' కొత్త కార్యవర్గం ఏర్పాటైంది: రాజశేఖర్
- అప్పటినుంచి నేను సినిమాలు చేయలేదు: రాజశేఖర్
- మా ఇంట్లో కూడా చాలా సమస్యలు ఎదురయ్యాయి: రాజశేఖర్
- 'మా' అసోసియేషన్ తగాదాల వల్లే కారు కూడా పోగొట్టుకున్నా: రాజశేఖర్
- మమ్ముల్ని కలిసి ఉండాలని చిరంజీవి కోరారు: రాజశేఖర్
- మా అసోసియేషన్‌లో నిప్పును కప్పి ఉంచితే పొగ రాకుండా ఉండదు: రాజశేఖర్
- రాజశేఖర్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడిన చిరంజీవి
- రాజశేఖర్ వ్యాఖ్యలపై 'మా' క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోవాలి: చిరంజీవి
- రాజశేఖర్ వ్యాఖ్యలను తప్పుబట్టిన నటుడు మోహన్‌బాబు
- స్పాట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన నటుడు నరేశ్
- ఇకపై 'మా'లో ఎలాంటి సమస్యలున్నా యాక్షన్ కమిటీకి తెలియజేయాలన్న నరేశ్
- బహిరంగంగా మాట్లాడితే చర్యలు తీసుకుంటామన్న నరేశ్