తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మా' గొడవలోకి శ్రీరెడ్డి.. ఆ ప్యానల్​పై తీవ్ర విమర్శలు - Srireddy criticizes powerstar pawankalyan

మెగాబ్రదర్స్​ చిరంజీవి, నాగబాబు, పవన్​కల్యాణ్​పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది నటి శ్రీరెడ్డి. 'మా' ఎన్నికల్లో ప్రకాశ్​రాజ్​ ప్యానల్​ సభ్యులు రాజీనామా చేయడం వెనుక వారి హస్తం ఉందని ఆరోపించింది.

srireddy
శ్రీరెడ్డి

By

Published : Oct 14, 2021, 1:19 PM IST

Updated : Oct 14, 2021, 2:46 PM IST

మెగా ఫ్యామిలీపై సంచలన వ్యాఖ్యలు చేసింది నటి శ్రీరెడ్డి. 'మా' ఎన్నికల్లో గెలిచిన ప్రకాశ్​రాజ్​ ప్యానల్​ సభ్యులు రాజీనామా చేయడం వెనుక మెగాబ్రదర్స్​ చిరంజీవి, నాగబాబు, పవన్​కల్యాణ్​ హస్తం ఉందని ఆరోపించింది. ఎన్నో ఏళ్లుగా తమ అధీనంలో ఉన్న 'మా' అసోసియేషన్​ చేజారిపోయినందుకు నాగబాబు, పవన్ క్రియేట్​ చేసిన​ డ్రామా అని పేర్కొంది. 'మా' ఎలక్షన్స్​లో అన్యాయం జరిగిందంటూ ప్రకాశ్​రాజ్​ ప్యానల్​ సభ్యులు పబ్లిసిటీ స్టంట్​లు చేస్తున్నారంటూ వారిపై విరుచుకుపడింది. నటులు, హేమ, ప్రగతి, ఉత్తేజ్​, బెనర్జీ, తనీశ్, శ్రీకాంత్​​ను తీవ్రంగా దూషించింది.

శ్రీరెడ్డి

రాజీనామా చేసిన ప్రకాశ్​రాజ్​ ప్యానల్​ ఓటమిని అంగీకరించాలని హితవు పలికింది శ్రీరెడ్డి. 'మా'కు సేవ చేస్తానని చెప్పిన వాళ్లు చిత్ర పరిశ్రమను రెండుగా ఎందుకు చీలుస్తున్నారని ప్రశ్నించింది. మోహన్​బాబు చిత్రసీమకు పెద్దదిక్కులాంటివారని, ఆయన నిజాయితీ గల మనిషని కితాబిచ్చింది.

ఇదీ చూడండి: ఈ 'దూకుడు' పిల్ల వయ్యారాలు చూడాల్సిందే!

Last Updated : Oct 14, 2021, 2:46 PM IST

ABOUT THE AUTHOR

...view details