పవన్(pawan kalyan vs mohan babu) చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మోహన్‌బాబు.. మా ఎన్నికల్లో తమ కుమారుడికి ఓటు వేసి గెలిపించాలని అన్నారు. ఆ తర్వాత మాట్లాడతానని చెప్పారు.పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై నటుడు మోహన్‌బాబు(mohan babu pawan kalyan) స్పందించారు. వయసులో తన కంటే చిన్నవాడని ఏకవచనంతో సంబోధించానని అన్నారు. చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్.. సంతోషమే ఓ నోట్ విడుదల చేశారు.'మా' ఎన్నికల(MAA elections 2021) తర్వాత మీ ప్రశ్నలకు జవాబిస్తానని పవన్ వ్యాఖ్యలకు బదులిచ్చారు. 'మా' ఎన్నికల్లో మీరు విష్ణు ప్యానెల్‌కు(Maa elections vishnu panel) ఓటేసి గెలిపించాలి అన్నారు.
"నా చిరకాల మిత్రుని సోదరుడైన పవన్‌కల్యాణ్ నువ్వు నాకంటే చిన్నవాడివి అందుకని ఏకవచనంతో సంభోదించాను. పవన్‌కల్యాణ్‌గారు అనడంలో కూడా తప్పేమీలేదు. చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్. సంతోషమే. ఇప్పుడు 'మా' ఎలక్షన్స్ జరుగుతున్నాయి. నా కుమారుడు విష్ణు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా నిలబడ్డాడన్న సంగతి మీకు తెలిసిందే. అక్టోబరు 10వ తేదీన ఎలక్షన్స్ అయిపోతాయి. ఆ తర్వాత నువ్వు అడిగిన ప్రతిమాటకీ నేను హృదయపూర్వకంగా సమాధానం చెబుతాను. ఈలోగా నువ్వు చేయవలసిన ముఖ్యమైన పని.. నీ అమూల్యమైన ఓటును నీ సోదర సమానుడైన విష్ణుబాబుకి అతని ప్యానల్‌కి వేసి వాళ్లని గెలిపించాలని కోరుకుంటున్నా."
-మోహన్‌బాబు ట్వీట్