తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Maa Elections 2021: ప్రకాశ్​రాజ్​పై రవిబాబు పరోక్ష విమర్శలు! - దర్శకుడు రవిబాబు ప్రకాశ్​రాజ్​

లోకల్​, నాన్​లోకల్(maa elections 2021)​ అనే విషయాన్ని పక్కనపెట్టి 'మా' ఎన్నికల్లో తెలుగువారినే అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని కోరారు ప్రముఖ దర్శకుడు, నటుడు రవిబాబు. ఇప్పటికే చిత్రసీమలో చాలా మంది పొరుగువాళ్లు ఉన్నారని చెప్పిన ఆయన.. 'మా' అసోసియేషన్​ను(maa elections schedule) కూడా వారికే అప్పగిస్తామా? అంటూ పరోక్షంగా ప్రకాశ్ రాజ్​ను విమర్శించారు.

ravi babu
రవిబాబు

By

Published : Oct 6, 2021, 12:27 PM IST

Updated : Oct 6, 2021, 12:35 PM IST

'మా' ఎన్నికల్లో(maa elections 2021) తెలుగువాళ్లనే అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని ప్రముఖ దర్శకుడు, నటుడు రవిబాబు కోరారు. తెలుగు వాళ్ల కోసం ఏర్పాటు చేసిన అసోసియేషన్​ను(maa elections schedule) కూడా పొరుగు వాళ్లకు అప్పగించాలా? అంటూ ప్రశ్నించిన ఆయన.. సినీ పరిశ్రమలో చాలా మంది ఇతర ప్రాంతాల వాళ్లు ఉన్నారని ధ్వజమెత్తారు.

రవిబాబు

కెమెరామెన్లు, మేకప్ మెన్లు, హెయిర్ డ్రెసర్లు కూడా ముంబయి నుంచి వస్తున్నారని, చివరకు 'మా' అసోసియేషన్​ను కూడా పొరుగు వాళ్లకు అప్పగిస్తామా? అంటూ పరోక్షంగా ప్రకాశ్ రాజ్​ను(maa elections prakash raj panel) విమర్శించారు రవిబాబు. లోకల్, నాన్ లోకల్ అనే విషయం 'మా' ఎన్నికల్లో పక్కనపెట్టి తెలుగు వారిని అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని రవిబాబు 'మా' అసోసియేషన్ సభ్యులకు విజ్ఞప్తి చేశారు.

Last Updated : Oct 6, 2021, 12:35 PM IST

ABOUT THE AUTHOR

...view details