టాలీవుడ్‌కు చెందిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) కార్యవర్గంలో భేదాభిప్రాయాలు వచ్చాయని.. అధ్యక్షుడు నరేశ్‌కు, రాజశేఖర్ కార్యవర్గం నోటీసులు ఇవ్వనుందనే వార్తలపై 'మా' స్పందించింది. అలాంటివి ఏమైనా ఉంటే అధికారికంగా తెలియజేస్తామని చెప్పింది.
"అసోసియేషన్ అంటే చాలా సమస్యలుంటాయి. వాటన్నింటిపై అందరూ చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. 'మా' వెల్ఫేర్‌కు సంబంధించి అత్యవసరంగా తీసుకోవాల్సిన చర్యలు గురించి ఎగ్జిక్యూటివ్ మీటింగ్ మంగళవారం జరిగింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు సంబంధించి మీడియాకు తెలియజేయాల్సిన వార్తలేమైనా ఉంటే అధికారికంగా తెలియజేస్తాం" -మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యవర్గం