తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఈ పాటలోనే 'రాధేశ్యామ్' కథ ఉంది' - radhe shyam prabhas

'రాధేశ్యామ్' సినిమాలోని 'ఈ రాతలే'.. తాను చేసిన ప్రయోగమని రచయిత కృష్ణకాంత్ అన్నారు. ఈ సాంగ్​లోనే సినిమా కథ ఉందని తెలిపారు.

radhe shyam movie
రాధేశ్యామ్ మూవీ

By

Published : Nov 21, 2021, 8:14 AM IST

"నా సినీ ప్రయాణంలో రాసిన అన్ని పాటలకంటే 'ఈ రాతలే' గీతమే పెద్ద ప్రయోగం" అని గేయ రచయిత కృష్ణకాంత్‌ అన్నారు. 'అందాల రాక్షసి', 'పడి పడి లేచే మనసు', 'టాక్సీవాలా', 'జెర్సీ' లాంటి విజయవంతమైన చిత్రాలకు పాటలందించిన ఆయన.. ఇప్పుడు ప్రభాస్‌ 'రాధేశ్యామ్‌' కోసం కలం కదిపారు. రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని గోపీకృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్. ఈ సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే రచయిత కృష్ణకాంత్‌ శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు.

గేయ రచయిత కృష్ణకాంత్

*1970లో యూరప్‌ నేపథ్యంగా సాగే ప్రేమకథ ఇది. దీని గురించి చాలా మంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కొంత మంది పునర్జన్మల కథను, ఇంకొంత మంది టైమ్‌ ట్రావెల్‌ అని, ట్రైన్‌లో జరిగే సినిమా అని ఏవేవో ఊహించుకుంటున్నారు. ఈ కథ ఏంటనేది వారి ఊహలకే వదిలేస్తున్నాను. ఈ చిత్రంలో నేను ఐదు పాటలు రాశాను. "ఈ రాతలే.." పాట వింటుంటే అందరికీ అర్థం కాదు. కాస్త సంక్లిష్టంగా అనిపిస్తుంటుంది. విజువల్‌గా చూస్తే ఎందుకిలా రాశామో అర్థమవుతుంది. నిజానికి ఈ పాటలోనే చిత్ర కథ ఉంటుంది. ఎక్కువ కథను సీన్స్‌లో చెప్పకుండా.. ఒక పాటలో మాంటేజ్‌లా చూపిద్దామని ఈ ప్రయోగం చేశాం.

* 'జిల్‌' సినిమా నుంచి రాధకృష్ణతో నా ప్రయాణం సాగుతోంది. దర్శక నిర్మాతలు, సంగీత దర్శకుడు జస్టిన్‌ ప్రభాకరన్‌ దగ్గరుండి నాతో ఈ పాటలు రాయించుకున్నారు. ఇందులో ప్రతి పాట సందర్భానుసారంగా వస్తుందే తప్ప ఎక్కడా బలవంతంగా ఇరికించినట్లు ఉండదు. నేనిప్పటి వరకు 400 పాటలు రాశా. 'ఈ రాతలే' పాటను పాకిస్తాన్‌, జపనీస్‌.. ఇలా ఎంతో మంది వారి భాషల్లో రాసి ట్విటర్‌లో ట్యాగ్‌ చేస్తున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రభాస్‌ లాంటి గ్లోబల్‌ స్టార్‌ సినిమాకు పాటలు రాసినందుకు సంతోషంగా ఉంది. కచ్చితంగా 'రాధేశ్యామ్‌' నా స్థాయిని పెంచుతుంది. ప్రస్తుతం 'శ్యామ్‌ సింగరాయ్‌' చిత్రంలో 4పాటలు రాశాను. అలాగే 'ది ఘోస్ట్‌', 'మేజర్‌', 'హిట్‌ 2' సినిమాలకు పని చేస్తున్నాను.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details