తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Love Story Review: 'లవ్​స్టోరి' మూవీ సోషల్​ రివ్యూ! - నాగ చైతన్య లవ్​స్టోరీ రివ్యూ

'లవ్​స్టోరి' చిత్రం శుక్రవారం(సెప్టెంబరు 24) థియేటర్లలో విడుదలైంది. శేఖర్​ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రానికి ప్రస్తుతం విశేషమైన ప్రేక్షకాదరణ(Love Story Review) లభిస్తోంది. సోషల్​మీడియాలో ఎటు చూసినా.. ఈ సినిమా గురించే చర్చ నడుస్తోంది.

Love Story Movie Netizens Review in Social Media
Love Story Review: 'లవ్​స్టోరి' మూవీ సోషల్​ రివ్యూ!

By

Published : Sep 24, 2021, 10:41 AM IST

Updated : Sep 24, 2021, 10:55 AM IST

సోషల్​మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా 'లవ్​స్టోరి' సినిమా(Love Story Review) మానియానే కనిపిస్తుంది. శేఖర్​ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన నేపథ్యంలో సినిమాపై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి పెరిగిపోతుంది. ఈ చిత్రం శుక్రవారం(సెప్టెంబరు 24) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలోని పాటలతో పాటు నాగచైతన్య, సాయిపల్లవి నటన.. శేఖర్​ కమ్ముల కథ సినిమాకు ప్రధాన బలమని ప్రేక్షకులు అంటున్నారు.

ఇలా 'లవ్​స్టోరి' సినిమాపై​ భారీ అంచనాలు నెలకొనడం వల్ల సినిమా టికెట్ల కోసం విడుదలకు నెల రోజుల ముందు నుంచే అడ్వాన్స్​ బుకింగ్స్​ హౌస్​ఫుల్స్​లో నిండిపోతున్నాయి. ఈ సినిమా ప్రివ్యూషోను ఇప్పటికే అమెరికా వంటి దేశాల్లో ప్రదర్శించగా.. ప్రతిఒక్కరి నుంచి పాజిటివ్​ రెస్పాన్స్​ వస్తుంది. దీంతో పాటు సోషల్​మీడియాలో ఈ సినిమా గురించి విపరీతంగా చర్చ నడుస్తుంది. నాగచైతన్య, సాయిపల్లవి నటనకు ఎంతోమంది ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

ఇదీ చూడండి..Hollywood movie: హాలీవుడ్​ ఛాన్స్​కు నో చెప్పిన మన స్టార్స్

Last Updated : Sep 24, 2021, 10:55 AM IST

ABOUT THE AUTHOR

...view details