కరోనా సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. భారత్‌లో లాక్డౌన్ కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. సినీ తారలు, క్రీడాకారులు ఈ ఖాళీ సమయంలో వారికి నచ్చిన వ్యాపకాలతో కాలక్షేపం చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా తన భర్త నిక్ జోనాస్‌తో కలిసి లాస్ ఏంజిల్స్‌లోని నివాసానికే పరిమితమైంది. రెండు నెలల తర్వాత ఇంటి నుంచి బయట అడుగు పెట్టినట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపిందీ నటి.
మాస్క్‌కు ధన్యవాదాలు