పెళ్లి.. ప్రతిఒక్కరి జీవితంలో ఎంతో మధురమైన అనుభూతి. నటీనటుల జీవితాల్లో మాత్రం ఈ అందమైన సందర్భం కాస్త ఆలస్యంగానే వస్తుంటుంది! ముఖ్యంగా హీరోయిన్లకు మూడు పదుల వయసు దాటుతోందంటే కొత్త హీరోయిన్ల కోసం అన్వేషణ మొదలు పెడుతుంది చిత్రసీమ. ఈలోగా అప్పటివరకు చిత్రసీమలో స్టార్‌గా వెలుగొందిన ఈ ముద్దుగుమ్మలు.. ఏ బడా పారిశ్రామికవేత్తనో, రిలేషన్షిప్లో ఉన్నవారితోనే లేదా సెలబ్రిటీనో పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతారు. ఆ తర్వాత అడపాదడపా తెరపై కనువిందు చేస్తారు లేదా కనుమరుగైపోతారు.
అయితే కొంతమంది నటీమణులు మాత్రం 40 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోకుండానే ఉన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల(రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడం, పెళ్లి మీద ఆలోచన లేకపోవడం, ఇతరత్ర కారణాలు) వైవాహిక జీవితానికి ఇంకా దూరంగానే ఉంటూ కెరీర్ కొనసాగిస్తున్నారు. అక్కగానో, వదినగానో లేక ఇతరత్రా సహాయ పాత్రలతోనే కెమెరా ముందు కనిపిస్తూనే ఉన్నారు. అలాంటి వాళ్ల గురించే ఈ స్టోరీ.
సితార
సితార.. బుల్లితెర, వెండితెరపై పలుహిట్ ధారావాహికలు, చిత్రాల్లో మూడు దశాబ్దాలుగా అలరిస్తోంది. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈమె.. ఆ తర్వాత సహాయనటిగా కెరీర్‌ను కొనసాగిస్తోంది. తెలుగులో శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం, లెజెండ్, అరవింద సమేత, హలోగురు ప్రేమ కోసమే, మిస్టర్ మజ్ను వంటి పలు సినిమాల్లో కనువిందు చేసింది. పెళ్లి చేసుకనే ఆలోచన లేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
నగ్మా
మెగస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ, రజనీకాంత్ సహా పలు స్టార్ హీరోలతో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో చక్కని అభినయంతో క్రేజ్ సంపాదించుకుంది. 1990లో 'బాఘీ: ఏ రెబల్ ఫర్ లవ్' హిందీ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ 2009లో సినిమాలకు గుడ్‌బై చెప్పి ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతోంది. ఈమెకూ ఇప్పట్లో పెళ్లి జరిగేలా కనిపించడం లేదు!
టబు