తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హాస్యంతో 'అనుభవించు రాజా'.. యాక్షన్​తో 'స్పైడర్​మ్యాన్' ట్రైలర్ - cinema news

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో లైగర్, అనుభవించు రాజా, స్పైడర్​మ్యాన్: నో వే హోమ్, బనారస్ చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

cinema news
సినిమా న్యూస్

By

Published : Nov 17, 2021, 1:43 PM IST

*'లైగర్' సినిమాలో దిగ్గజ బాక్సర్ మైక్​ టైనస్​ నటిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం చిత్రబృందం అమెరికాలో ఉంది. ఆయనపై కీలక సన్నివేశాల్ని తీస్తున్నారు. ఇందులో భాగంగా టైసన్​తో తీసుకున్న ఫొటోల్ని నిర్మాత ఛార్మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్​గా నటిస్తున్నారు. అనన్య పాండే హీరోయిన్. దర్శకుడు పూరీ జగన్నాథ్.. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పూరీ, ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కరణ్​ జోహార్​ హిందీలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. వచ్చే ఏడాది వేసవిలో థియేటర్లలోకి 'లైగర్' వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

*రాజ్​తరుణ్ 'అనుభవించు రాజా' ట్రైలర్​ వచ్చేసింది. కింగ్ నాగార్జున.. బుధవారం దీనిని రిలీజ్ చేశారు. ఆద్యంతం హాస్యభరితంగా ఉన్న ఈ ప్రచార చిత్రం.. సినిమాపై అంచనాల్ని పెంచుతోంది.

ఇందులో రాజ్​తరుణ్ సెక్యూరిటీ గార్డ్​గా నటించారు. కశిష్ ఖాన్ హీరోయిన్​గా చేసింది. శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహించారు. సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరించారు. పల్లెటూరి నేపథ్యంగా తీసిన ఈ సినిమా.. నవంబరు 26న థియేటర్లలోకి రానుంది.

*'స్పైడర్​మ్యాన్: నో వే హోమ్' ట్రైలర్​ బుధవారం రిలీజైంది. ఫుల్​ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ సినిమా.. 'పుష్ప'తో పాటు డిసెంబరు 17న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి జాన్ వాట్స్ దర్శకత్వం వహించారు.

ఇందులో డాక్టర్ స్ట్రేంజ్​ పాత్ర కూడా ఉంది. అలానే 'స్పైడర్​ మ్యాన్' సినిమాలోని పలు కీలకపాత్రలు ఇందులో కనిపించాయి. అలానే ఈ సినిమాలో ముగ్గురు 'స్పైడర్​మ్యాన్'లు ఒకే సీన్​లో కనిపించనున్నారనే అంటున్నారు. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.

*జైద్ ఖాన్, సోనాల్ మొనితిరో హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'బనాసర్'. వారణాసి నేపథ్యంగా తీస్తున్నారు. బుధవారం మోషన్​పోస్టర్​తో పాటు ఫస్ట్​లుక్​ను రిలీజ్ చేశారు. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాకు జయతీర్ధ డైరెక్టర్. త్వరలో పూర్తి వివరాలు వెల్లడించడం సహా సినిమా రిలీజ్ డేట్​ను ప్రకటించే అవకాశముంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details