'భూమిని పచ్చగా ఉంచే ప్రయత్నం చేద్దాం' - సాయి ధరమ్ తేజ్
ప్రపంచ పర్యావరణ దినోత్సవం (World Environmental Day) సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ అవగాహన కల్పిస్తున్నారు పలువురు సెలబ్రిటీలు. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్స్ నెట్టింట సందేశమిచ్చారు.
'భూమిని పచ్చగా ఉంచే ప్రయత్నం చేద్దాం'
ప్రపంచ పర్యావరణ దినోత్సవం (World Environmental Day-జూన్ 5) సందర్భంగా పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ అవగాహన కల్పిస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిది అంటూ సలహాలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు (Mahesh Babu), అల్లు అర్జున్ (Allu Arjun), సాయి ధరమ్ తేజ్ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు.
- పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించుకుందామని ప్రతిజ్ఞ చేద్దాం. మన భూగ్రహాన్ని పచ్చగా ఉండే ప్రయత్నం చేద్దాం - మహేష్ బాబు.
- మనం నివసించడానికి ఉన్న ఏకైక ఇల్లు భూమి. దాన్ని నాశనం చేయడం ఆపేద్దాం. దానికి కోలుకునే సమయం ఇద్దాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనం అందరు ఈ భూమిని కాపాడుకునేందుకు కృషి చేద్దాం -సాయి ధరమ్ తేజ్
- ఈ పర్యావరణ దినోత్సవం రోజున ప్రతి ఒక్కరు ఎక్కువ మొక్కలు నాటుదాం అని ప్రతిజ్ఞ చేద్దాం. రానున్న తరాల వారికి కూడా ఆకుపచ్చగా ఉండే భూమిని ఇచ్చే ప్రయత్నం చేద్దాం. మొక్కలను నాటిన ఫొటోలు తనకు షేర్ చేస్తే వాటిని రీ షేర్ చేస్తా -అల్లు అర్జున్.
Last Updated : Jun 5, 2021, 3:36 PM IST