తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ సినిమా హీరోకు రూ.223 కోట్లు.. హీరోయిన్​కు రూ.186 కోట్లు - మూవీ లేటెస్ట్ న్యూస్

హాలీవుడ్​లో తీస్తున్న సైన్స్ ఫిక్షన్ సినిమా కోసం హీరోహీరోయిన్లకు కళ్లు చెదిరే మొత్తం రెమ్యునరేషన్​గా ఇస్తున్నట్లు సమాచారం. ఇంతకీ దాని సంగతేంటి? ఆ నటులు ఎవరు?

Leonardo DiCaprio
డికాప్రియో జెన్నీఫర్

By

Published : Aug 21, 2021, 7:33 AM IST

Updated : Aug 21, 2021, 2:56 PM IST

హాలీవుడ్ ప్రముఖ నటులు లియోనార్డో డికాప్రోయో, జెన్నీఫర్ లారెన్స్ కలిసి నటిస్తున్న నెట్​ఫ్లిక్స్ చిత్రం 'డోంట్ లుక్ అప్'. సైన్స్ ఫిక్షన్ బ్లాక్ కామెడీ కథతో ఆడమ్ మెకాయ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం డికాప్రియో, జెన్నీఫర్​లకు భారీ పారితోషికం అందినట్లు తెలుస్తోంది.

లియోనార్డో డికాప్రియో- జెన్నీఫర్ లారెన్స్

హాలీవుడ్​ వర్గాల కథనం ప్రకారం డికాప్రియోకు రూ.223 కోట్లు, జెన్నీఫర్ లారెన్స్​కు రూ.186 కోట్లు ఇస్తున్నట్లు సమాచారం. భూమిని నాశనం చేయడానికి నింగి నుంచి జారిపడే ఓ ఆస్టరాయిడ్ చుట్టూ తిరిగే కథ ఇది. ఈ చిత్రంలో మెరిల్ స్ట్రీప్, రాబ్ మోర్గాన్, కేట్ బ్లాంచెట్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

'డోంట్ లుక్ అప్' మూవీ టీమ్

ఇవీ చదవండి:

Last Updated : Aug 21, 2021, 2:56 PM IST

ABOUT THE AUTHOR

...view details