Singer Sandhya mukherjee died: చిత్రసీమలో ఎన్నో సూపర్‌హిట్ పాటలు పాడిన మరో గొంతుక మూగబోయింది. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బెంగాలీ సింగర్ సంధ్య ముఖర్జీ(90) మంగళవారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆమె మృతి పట్ల పలువురు సినీప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
1931 అక్టోబర్ 4న బంగాల్లోని కోల్‌కతాలో జన్మించారు సంధ్య. 'అన్జాన్ గర్హ్' సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత ఎన్నో చిత్రాలకు సూపర్ హిట్ పాటలు పాడారు. పశ్చిమ బంగాలోని రాష్ట్ర అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. జాతీయ అవార్డు పద్మశ్రీ కూడా ఆమెకు వరించింది.