తెలంగాణ

telangana

ETV Bharat / sitara

లతా మంగేష్కర్ పాడిన తెలుగు పాటలు ఇవే - lata mangeshkar covid

Lata mangeshkar telugu songs: ఎన్నో వేల పాటలతో సంగీత ప్రియుల్ని అలరించిన దిగ్గజ గాయని లతా మంగేష్కర్.. తెలుగు మాత్రం చాలా తక్కువ పాటలే పాడారు. ఇంతకీ అవేంటంటే?

lata mangeshkar
లతా మంగేష్కర్

By

Published : Feb 6, 2022, 3:05 PM IST

భారతీయ సినీ సంగీత ప్రపంచంలోని సంగీత శిఖరం నేలకొరిగింది. దిగ్గజ గాయని, భారతరత్న లతా మంగేష్కర్‌ మృతి యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. దాదాపు అన్ని భారతీయ భాషల్లో వేల సంఖ్యలో గీతాలను ఆలపించిన ఆమె, తెలుగులో మాత్రం చాలా తక్కువ పాటలు పాడారు.

1955లో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి నటించిన 'సంతానం' చిత్రంలో ఆమె తొలిసారి తెలుగు పాటను పాడారు. 'నిదురపోరా తమ్ముడా' అంటూ సాగే పాటకు సుసర్ల దక్షిణామూర్తి సంగీత దర్శకత్వం వహించారు. తర్వాత 1965లో ఎన్టీఆర్, జమునల 'దొరికితే దొంగలు' చిత్రంలో 'శ్రీ వేంకటేశా' పాటను పాడారు. సాలూరి రాజేశ్వరరావు ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు.

1988లో నాగార్జున, శ్రీదేవి జంటగా నటించగా ఇళయరాజా సంగీతమందించిన 'ఆఖరి పోరాటం' సినిమాలోని 'తెల్లచీరకు' పాటను గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి పాడారు. ఈ పాట ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌.

వీటితో పాటు 'శ్రీదేవి' సినిమాలో పాటలు పాడారు. యష్ చోప్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీదేవి కథానాయికగా నటించగా, రిషి కపూర్, వినోద్ ఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను తెలుగులో డబ్ చేయగా.. అందులో మూడు పాటలను లతా మంగేష్కర్ పాడారు. ఈ పాటలకు కూడా మంచి ఆదరణ దక్కింది.

1995లో ప్రేక్షకులను విశేషంగా అలరించిన చిత్రం 'దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే'. ఇందులో ఆమె పాడిన 'తుఝే దేఖాతోయే జానా సనమ్' భాషతో సంబంధం లేకుండా సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసింది. మరీ ముఖ్యంగా ఈ తరం శ్రోతలు లత గానానికి ఫిదా అయిపోయారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details