తెలంగాణ

telangana

ETV Bharat / sitara

శాండ్​ఆర్ట్​తో అలరిస్తోన్న 'లచ్చా గుమ్మాడీ' పాట - మిస్​ ఇండియా సినిమా న్యూస్

స్టార్ హీరోయిన్​ కీర్తి సురేశ్​ ప్రధానపాత్రలో నటించిన 'మిస్​ ఇండియా' ట్రైలర్​ నెట్టింట విశేషాదరణ దక్కించుకుంటోంది. నెట్​ఫ్లిక్స్​ ద్వారా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఈ నేపథ్యంలో సినిమాలోని రెండో లిరికల్​ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం.

Lacha Gummadi lyrical video released from miss india movie
శాండ్​ఆర్ట్​తో ఆకట్టుకుంటోన్న 'లచ్చా గుమ్మాడీ' పాట

By

Published : Oct 28, 2020, 7:31 PM IST

'మహానటి' కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'మిస్ ఇండియా'. ఈ సినిమాలో కీర్తి ఓ బిజినెస్​ ఉమెన్​గా కనిపించనుంది. నరేంద్రనాథ్ దర్శకత్వం వహించాడు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్​ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను నెట్​ఫ్లిక్స్​ ద్వారా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్రబృందం. ఈ నేపథ్యంలో సినిమాలోని రెండో లిరికల్​.. 'లచ్చా గుమ్మాడీ' వీడియోను సోషల్​మీడియాలో విడుదల చేశారు. ఇందులోని పాటకు శాండ్​ ఆర్ట్​తో దృశ్యాలను చూపించడం ఆకర్షణీయంగా ఉంది.

ఈ చిత్రంలో కీర్తి.. సొంతంగా బిజినెస్ చేయాలనే ఆలోచన కలిగిన సంయుక్త అనే పాత్రలో కనిపించింది. అందుకోసం భారతీయ టీని విదేశాల్లో అమ్మేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో తనకు ఎదురైన అడ్డంకులేంటి?, తన ఆశయాన్ని సంయుక్త సాధించిందా?లేదా? అనే స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details