జీవితంలోని అనుభవాలతో మృగ ప్రవృత్తి పెరిగిన మనుషులంతా ఒకేచోట చేరి నేరాలను వ్యాపారంగా మారిస్తే.. పోలీసులు అలాంటి వారిని ఎలా అణిచివేశారనే కథతో హిందీలో తెరకెక్కిన వెబ్ సిరీస్ 'లాల్‌బజార్'. కౌషిక్ సేన్, సవ్యసాచి చక్రవర్తి, సౌరసేని మైత్రా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్ జూన్ 19న ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారం చిత్ర నిర్మాత అజయ్ దేవగణ్ ట్విట్టర్ వేదికగా టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో హత్యలు, ఘోరాలకు పాల్పడే వ్యక్తులతో పోలీసుల పోరాటాన్ని చూపించారు. ఆసక్తికరంగా ఉన్న ఈ టీజర్‌కు ప్రేక్షకుల్లో మంచి స్పందన లభిస్తోంది.
మనుషుల్ని చంపడమే వారి వ్యాపారం! - లాల్‌బజార్ సినిమా వార్తలు
అజయ్ దేవగణ్ నిర్మాతగా వ్యవహరించిన 'లాల్‌బజార్' వెబ్‌సిరీస్ టీజర్ విడుదలైంది. హత్యలు, నేరాలకు పాల్పడే వ్యక్తులతో పోలీసుల పోరాటాల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం జూన్ 19న ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
మనుషుల్ని చంపడమే వారి వ్యాపారం!
అజయ్ 'తానాజీ' సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కాజోల్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ మంచి హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఆయన తెలుగులో 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాలో నటిస్తున్నారు. అజయ్ నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం. నటుడిగా, నిర్మాతగానూ అజయ్ చేతిలో దాదాపు ఎనిమిది సినిమాలు ఉన్నాయి.
Last Updated : Jun 14, 2020, 12:41 AM IST