మల్లేశం బృందానికి కేటీఆర్ అభినందన... - jhansi
చేనేత కార్మికుల కోసం ఆసు యంత్రం కనిపెట్టిన మల్లేశం జీవిత కథే ఈ సినిమా..
![మల్లేశం బృందానికి కేటీఆర్ అభినందన...](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2353345-769-708b3207-0780-4500-87c1-2199979852d2.png)
చేనేత కార్మికులకు చేయూతనిచ్చే యంత్రాన్ని కొనుగొని పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న చేనేత కార్మికుడు చింతకింది మల్లేశం. అతని జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం "మల్లేశం". ప్రముఖ హాస్యనటుడు ప్రియదర్శి మల్లేశం పాత్రలో నటిస్తున్నారు. తొలిరూపును చిత్ర బృందం సిరిసిల్ల జిల్లాలో విడుదల చేసింది.
స్టూడియో 99 ఫిల్మ్ పతాకంపై రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. మల్లేశం తల్లి పాత్రలో నటి, వ్యాఖ్యాత ఝాన్సీ నటించగా... ప్రముఖ రచయితలు గోరెటి వెంకన్న, చంద్రబోస్ సాహిత్యాన్ని అందిస్తున్నారు. కేటీఆర్ తన ట్విట్టర్ వేదికగా చిత్ర బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.