డార్లింగ్ ప్రభాస్ 'ఆదిపురుష్'లో సీత పాత్రధారి ఎవరు? అంటూ గత కొన్నిరోజుల నుంచి చర్చిస్తూనే ఉన్నారు. అందుకు తగ్గట్లుగానే పలువురు హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే హీరోయిన్ కృతిసనన్ ఇందుకోసం దాదాపు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం.
ప్రభాస్ 'ఆదిపురుష్'లో సీత పాత్ర ఆమెదే! - kriti sanon news
తెలుగు, హిందీలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న కృతిసనన్.. ప్రభాస్ సరసన సీతగా నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై త్వరలో ప్రకటన కూడా రానుంది.
ప్రభాస్ 'ఆదిపురుష్'లో సీత పాత్ర ఆమెదే!
ఇందులో ప్రభాస్ శ్రీరాముడిగా కనిపించనున్నారు. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడు రావణుడిగా నటించనున్నారు. ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తుండగా టీ-సిరీస్ సంస్థతో కలిసి రెట్రోఫైల్స్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. 2022 ఆగస్టు 11న సినిమాను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
Last Updated : Nov 28, 2020, 10:40 AM IST