తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కడుపుబ్బా నవ్విస్తానంటున్న కృతి - బాలీవుడ్​ కృతిసనన్​ తాజా సినిమాలు

ప్రముఖ బాలీవుడ్ నటి కృతిసనన్​ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'మిమి'. ఈ సినిమా సున్నితమైన కథాంశమని, ఓ డాక్యుమెంటరీలా అనిపించినా... ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుందని చెప్పిందీ భామ.

kriti sanon mimi movie
కడుపుబ్బా నవ్విస్తానంటున్న కృతి

By

Published : Nov 28, 2019, 5:33 AM IST

బాలీవుడ్‌ చిత్రాల్లో నటించాలని అందరికీ ఉంటుంది. కానీ కొందరికే అవకాశం వస్తుంది. అలాంటిది తొలుత ప్రాంతీయ చిత్రాల్లో ప్రస్థానం మొదలెట్టి, ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లి తనకంటూ ఓ ప్రత్యేతను సంపాదించుకున్న నటి కృతిసనన్‌. ప్రస్తుతం కృతి 'మిమి' చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. తను నటించబోయే సినిమా సున్నితమైన కథాంశమని, అయినప్పటికీ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుందని చెప్పిందీ భామ. ఇంకా తన పాత్ర గురించి ఈ విధంగా చెప్పుకొచ్చింది.

"ఇది మీకు ఒక డ్యాకుమెంటరీలా అనిపించవచ్చు. కానీ చిత్రంలో ఉన్న హాస్యం, వినోదం మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. మూవీలో ముందుగా నేనొక నర్తకి పాత్రలో ఉన్నా, చివరికి అది సరోగసి మదర్‌ పాత్రతో ముగుస్తుంది."

కృతి సనన్, సినీ నటి

లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మిమి' చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. మరాఠి సినిమా 'మలా ఆయి వ్యహచాయ్' ఆధారంగా రూపొందుతోందీ చిత్రం. సరోగసి(అద్దెగర్భం) నేపథ్య కథాంశంతో ఈ చిత్రం తీస్తున్నారు.

కృతి ససన్‌ ఈ సంవత్సరంలో ఇప్పటికే నాలుగు చిత్రాల్లో నటించి మెప్పించింది. 'పానిపట్‌', 'పతి పత్ని ఔర్‌ వో' లాంటి చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ మధ్యనే విడుదలైన 'హౌస్‌ఫుల్‌4' చిత్రంలో రాజకుమారి మధు పాత్రలో నటించి అలరించింది.

ఇది చదవండి: ప‌వ‌న్ క‌ల్యాణ్ 'జార్జ్​రెడ్డి' పాత్ర చేయాల‌నుకున్నారు!

ABOUT THE AUTHOR

...view details