తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రవితేజ, రజనీ చిత్రాల రిలీజ్​కు ముహూర్తం ఖరారు - ఇచ్చట వాహనాలు నిలుపరాదు

కొత్త సినిమా అప్​డేట్స్ వచ్చేశాయి. సూపర్​స్టార్​ కొత్త చిత్రం విడుదల తేదీ సహా మరికొన్ని సినిమాల టీజర్​ కబుర్లు ఇందులో ఉన్నాయి.

Krack movie getting release to AhA OTT on FEB 5.. annaatthe movie release date announced
రవితేజ, రజనీ చిత్రాల విడుదలకు ముహూర్తం ఖరారు

By

Published : Jan 25, 2021, 10:50 PM IST

  • ఈ ఏడాది సంక్రాంతి సీజన్​లో విడుదలైన క్రాక్​ చిత్రం.. బాక్సాఫీసు వద్ద ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని జనవరి నెలాఖరున 'ఆహా' ఓటీటీలో విడుదల చేయనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై సదరు ఓటీటీ సంస్థ స్పష్టత ఇచ్చింది. 'క్రాక్​'ను ప్రేక్షకులు థియేటర్లలో ఆదరిస్తున్న నేపథ్యంలో సినిమాను ఓటీటీలో ప్రసారం చేయడం సరికాదని 'ఆహా' అభిప్రాయపడింది. దీంతో అనుకున్న తేదీ కంటే వారం రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 5న 'క్రాక్'​ చిత్రాన్ని డిజిటల్​ ప్లాట్​ఫామ్​లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సోమవారం ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది.
    'క్రాక్​' సినిమా ఓటీటీ రిలీజ్​ పోస్టర్​
  • సూపర్​స్టార్​ రజనీకాంత్​ ప్రధానపాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'అణ్ణాత్తే'. ఈ చిత్రాన్ని ఈ ఏడాది నవంబరు 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
రజనీకాంత్​ 'అణ్ణాత్తే' విడుదల తేదీ ప్రకటన
  • యువ కథానాయకుడు సుశాంత్​ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'ఇచ్చట వాహనాలు నిలుపరాదు'. ఈ సినిమా టీజర్​ను జనవరి 29న విడుదల చేయనున్నట్లు సుశాంత్​ సోషల్​మీడియాలో వెల్లడించారు.
  • హాకీ నేపథ్యంతో టాలీవుడ్​లో రూపొందుతోన్న తొలిచిత్రం 'ఏ1 ఎక్స్​ప్రెస్​'. ఇందులో సందీప్​ కిషన్​, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్ర టీజర్​ను గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న సాయంత్రం 4.44 గంటలకు విడుదల చేయనున్నారు.
'ఏ1 ఎక్స్​ప్రెస్​' విడుదల తేదీ పోస్టర్​
  • నూతన నటీనటులు అనురాగ్​, ముస్కాన్​ సేథి నటిస్తున్న చిత్రం 'రాధాకృష్ణ'. ఈ సినిమాను ఫిబ్రవరి 5న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
'రాధాకృష్ణ' సినిమా రిలీజ్​ పోస్టర్​

ABOUT THE AUTHOR

...view details