తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కౌసల్య కృష్ణమూర్తిలో ఈ పాట విన్నారా..? - movie

తమిళంలో హిట్టైన 'కానా' చిత్రానికి రీమేక్​గా తెలుగులో తెరకెక్కుతోన్న 'కౌసల్య కృష్ణమూర్తి' సినిమాలో ఓ పాట విడుదలైంది. మాతృకలో సాంగ్​ మాదిరే తెలుగు పాట ఆకట్టుకుంటోంది.

ఐశ్వర్య రాజేశ్

By

Published : Jun 25, 2019, 9:05 AM IST

ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'కౌసల్య కృష్ణమూర్తి'. తాజాగా ఈ చిత్రంలో 'ముద్దబంతి పూవ్వు ఇలా..' అనే పాట విడుదలైంది. తమిళ చిత్రం 'కానా'కు రీమేక్​గా తెరకెక్కుతోంది 'కౌసల్య కృష్ణమూర్తి' చిత్రం. మాతృకలో ఉన్న 'ఒత్తాయడి పాదయిలా..' అంటూ సాగే పాటను తెలుగులో 'ముద్దబంతి పువ్వు..' పేరుతో రూపొందించారు.

తమిళలో హిట్టైన ఆ సాంగ్​ తెలుగులోనూ అంతే రీతిలో ఆకట్టుకుంటోంది. అక్కడ దాదాపు 7కోట్ల మంది ఆ పాటను వీక్షించారు. ధిబు నినాన్ థామస్ సంగీతం సమకూర్చిన ఈ తెలుగు పాటను యాజిన్ నజీర్ ఆలపించాడు. కృష్ణకాంత్ సాహిత్యమందించాడు.

క్రికెట్ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోంది. క్రికెటర్ కావాలనే ఓ అమ్మాయి తన కలను ఎలా నెరవేర్చుకుంది అనేది ప్రధాన కథాంశం. కేఏ వల్లభ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇది చదవండి: రాములమ్మకు బర్త్​డే విషెస్ చెప్పిన మహేశ్

ABOUT THE AUTHOR

...view details