కపూర్ కుటుంబం నుంచి మరో ముద్దుగుమ్మ వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రాబోతుంది. బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్ కుమార్తె శనాయా కపూర్ త్వరలోనే ఓ కొత్త సినిమాతో పరిచయం కానుంది. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. శనాయా అందాలొలికిస్తూ హొయలుపోతున్న వీడియోను షేర్ చేశారు.
కపూర్ ఫ్యామిలీ నుంచి మరో ముద్దుగుమ్మ - Sanjay Kapoor's daughter Shanaya kapoor
బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్ కుమార్తె శనాయా కపూర్ త్వరలోనే వెండితెర ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఈ ముద్దుగుమ్మను పరిచయం చేయబోతున్నారు.
షానయ కపూర్
సంజయ్ కపూర్, నటుడు అనిల్ కపూర్, నిర్మాత బోణీకపూర్ అన్నదమ్ములు. ఇప్పటికే అనిల్ వారసురాలిగా సోనమ్, బోణీ వారసురాలిగా జాన్వీ కపూర్ పలు హిట్ సినిమాల్లో నటించి తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మరి శనాయా ఎలా రాణిస్తుందో చూడాలి మరి.
ఇదీ చూడండి: ముద్దు అడిగిన ఫ్యాన్‌కు జాన్వీ ఫన్నీ రిప్లై