విభిన్న సినిమాలు చేస్తూ తమిళంలోనే కాకుండా తెలుగులోనూ అభిమానులను సొంతం చేసుకున్నాడు విజయ్ ఆంటోనీ. ఈ హీరో ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'కిల్లర్'. యాక్షన్ కింగ్ అర్జున్ కీలకపాత్రలో నటించాడు. విడుదలైన 'స్నీక్ పీక్' టీజర్ ప్రేక్షకులను అలరిస్తోంది.
అషిమా నర్వాల్ హీరోయిన్గా నటించింది. దియా మూవీస్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఆండ్రూ లూయిస్ దర్శకత్వం వహిస్తున్నాడు