'భరత్ అనే నేను' చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన నటి కియారా అడ్వాణీ. ఆ సినిమా తర్వాత మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ'లో నటించింది. తాజాగా మెగాప్రిన్స్ వరుణ్‌తేజ్‌తో రొమాన్స్ చేయనుందట ముంబయి భామ.
వరుణ్ కథానాయకుడిగా 'బాక్సర్' అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం కియారాని సంప్రదించిందట చిత్రబృందం. ఇందుకు ఆమె కూడా పచ్చజెండా ఊపిందని సమాచారం. క్రీడా నేపథ్యంలో సాగే ఈ సినిమాకి కిరణ్ కొర్రపాటి తొలిసారి దర్శకత్వం వహించనున్నాడు.