"అభద్రత.. మనల్ని బలంగా తయారు చేస్తుంది" అని హీరోయిన్ కియారా అడ్వాణీ అంటోంది. 'భరత్ అనే నేను'తో తెలుగులో మెరిసిన ఈ అందాల భామ 'కబీర్ సింగ్' చిత్రంతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. 'మీరు నటిగా అభద్రతకు గురవుతున్నారా?' అని ఇటీవల ఆన్‌లైన్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నకు స్పందించింది.
Kiara Advani: 'మనల్ని బలంగా తయారు చేసేది అదే'
తెలుగు, హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న కియారా అడ్వాణీ(Kiara Advani).. అభద్రత(Insecurity) గురించి చెప్పింది. దీని వల్ల మనం బలంగా తయారవుతామని తెలిపింది.
కియారా అడ్వాణీ
"అవును.. అభద్రత నాలోని ఉత్తమమైన ప్రతిభను వెలికితీస్తుంది. అది మనల్ని పరిస్థితుల్ని ఎదుర్కొనే బలవంతులుగా తయారుచేస్తుంది. ప్రతి ఒక్కరిలో అభద్రత కొంచెమైనా ఉంటే.. నాకు తెలిసి వారు పూర్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తారు" అని కియారా చెప్పింది. ప్రస్తుతం ఆమె 'జుగ్ జుగ్ జియో', 'షేర్ షా' చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులోనూ రెండు ప్రాజెక్టులు చర్చలు దశలో ఉన్నాయి.
ఇవీ చదవండి: