తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రీమేక్ చిత్రాల​ రాణిగా మహేశ్​ హీరోయిన్ - హిందీ

బాలీవుడ్​ బ్యూటీ కియారా అడ్వాణీ... ప్రస్తుతం హిందీలో రీమేక్ అవుతున్న పరభాష చిత్రాల్లో హీరోయిన్​ పాత్రకు కేరాఫ్ అడ్రస్​గా నిలుస్తోంది. గతంలో పలు రీమేక్​ చిత్రాల్లో నటించిన ఈ భామ తాజాగా తెలుగు, తమిళంలో ఘన విజయాన్ని అందుకున్న అర్జున్​రెడ్డి, కాంచన చిత్రాల హిందీ రీమేక్​ లోనూ నటిస్తోంది.

హిందీలో రీమేక్ చిత్రాల​ రాణి ఈ బ్యూటీ

By

Published : Jun 14, 2019, 5:43 PM IST

బాలీవుడ్​లో రీమేక్​ చిత్రాల ట్రెండ్ కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో హిందీలో రీమేక్ అవుతున్న పరభాష చిత్రాలకు అందాల సుందరి 'కియారా అడ్వాణీ' కేరాఫ్​ అడ్రస్​గా నిలుస్తోంది. గతంలో పలు రీమేక్​ చిత్రాల్లో ఆడిపాడిన ఈ ముద్దుగుమ్మ తాజాగా తెలుగు, తమిళంలో ఘనవిజయం సాధించిన అర్జున్​రెడ్డి, కాంచన చిత్రాల హిందీ రీమేక్​లోనూ నటిస్తోంది. ఈ రెండు చిత్రాలను మాతృక భాషలో తెరకెక్కించిన సందీప్​ రెడ్డి, రాఘవ లారెన్స్​లే హిందీ రీమేక్​లో దర్శకత్వం వహిస్తున్నారు. అర్జున్​ రెడ్డి చిత్రం 'కబీర్​ సింగ్'​ పేరుతో, కాంచన సినిమా 'లక్ష్మీ బాంబు' పేరుతో హిందీలో రీమేక్​ అవుతున్నాయి. ఈ రెండు చిత్రాల్లో హీరోయిన్​గా నటిస్తుండడంపై కియారా ఆనందం వ్యక్తం చేసింది.

" ఈ రెండు చిత్రాల్లో భాగస్వామి అయినందుకు నాకు థ్రిల్​గా ఉంది. కబీర్​ సింగ్​లో అవకాశం రావడానికంటే చాలా ముందే నేను అర్జున్​రెడ్డి చిత్రం చూశాను. ఆ సినిమా అంటే నాకు ఎంతో ఇష్టం. ఇలాంటి రొమాంటిక్​ చిత్రాల్లో నటించాలని నా మనసులో ఆశపడ్డాను. అనుకున్నట్లుగానే హిందీ రీమేక్​లో నటించే అవకాశం వచ్చింది. లక్ష్మీబాంబుకు సంబంధించినంత వరకు.. ఈ చిత్రం స్క్రిప్ట్​ అద్భుతంగా ఉంది. ఇది మాతృక భాషలోని సినిమాతో పోలిస్తే కొత్తగా ఉంటుంది. అందుకే తమిళంలోని కాంచన సినిమాను చూడొద్దని నిర్మాతలు నాకు సూచించారు. అయితే ఈ రెండు చిత్రాల రీమేకులకు మాతృకంలో తెరకెక్కించినవారే దర్శకత్వం వహిస్తున్నందున నా పని తేలికవుతుంది."
-కియారా అడ్వాణీ

కియారా అడ్వాణీకి దక్షిణాదిన మంచి ఫాలోయింగ్​ ఉంది. తెలుగులో నటించిన తొలి చిత్రం భరత్​ అనే నేను చిత్రంతోనే ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. రామ్​ చరణ్​కు జోడీ వినయ విధేయ రామలోనూ నటించి అందచందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది కియారా.

ABOUT THE AUTHOR

...view details