తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ముద్దు సన్నివేశాల్లో నటించడం చాలా తేలిక'​ - arjun reddy hindi

బాలీవుడ్​ నటుడు షాహిద్​ కపూర్ హీరోగా​ తెలుగు సెన్సేషనల్​ చిత్రం ‘అర్జున్‌రెడ్డి’ హిందీలో ‘కబీర్‌ సింగ్‌’గా తెరకెక్కింది. కియారా అడ్వాణీ నాయిక. తెలుగు మాతృకకు దర్శకత్వం వహించిన సందీప్‌ రెడ్డి వంగా హిందీలోనూ రూపొందించారు. ఈ చిత్రం జూన్‌ 21న విడుదల కానుంది. తాజాగా సినిమాలోని ఘాటైన అదర చుంబనాలపై మనసులో మాట బయటపెట్టింది కియారా.

ముద్దు సన్నివేశాల్లో నటించడం చాలా తేలిక​: కియారా

By

Published : Jun 10, 2019, 8:01 AM IST

"ముద్దు సన్నివేశాలు చేసే సమయంలో తప్ప.. దానికి ముందు ఆ తర్వాత వాటి గురించి ఆలోచనే ఉండదు" అంటోంది కియారా అడ్వాణీ. త్వరలో ఈ భామ 'కబీర్‌ సింగ్‌' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, పాటల్లో.. షాహిద్‌ - కియారా మధ్య వచ్చే ఘాటైన అదరచుంబనాలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాలోని లిప్‌లాక్‌ల ముచ్చట గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీడియాతో పంచుకుంది కియారా.

" చిత్ర ప్రచార వీడియోల్లో ఘాటైన ముద్దు సన్నివేశాలు ఉన్నాయి. అలాంటి సీన్స్‌ ఈ చిత్రంలో చాలా ఉన్నాయి. ఈ సినిమాలోని లిప్​లాక్​ సన్నివేశాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా మేమిద్దరం చాలా సింపుల్‌గా పూర్తి చేసేశాము. ఎందుకంటే ఆ ముద్దు సీన్స్‌ కథలో ఒక భాగంగానే ఉంటాయి. కాబట్టి వాటికి ఎక్కువ కష్టపడాల్సింది ఏముంటుంది. లిప్‌లాక్‌ సీన్స్‌ తీస్తున్న సమయంలో తప్ప.. దానికి ముందు ఆ తర్వాత నాకు వాటి గురించి ఆలోచనే ఉండదు. అలాంటి సన్నివేశాలను చాలా తేలికగా షూట్‌ చేసేయడం వల్ల వాటి గురించి తర్వాత ఆలోచించాల్సిన అవసరం రాదు ".

-- కియారా అడ్వాణీ, సినీ నటి

ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉన్న ఈ చిత్రం జూన్‌ 21న థియేటర్లలోకి రాబోతుంది.

ఇవీ చూడండి..

త్వరలో కియారా డేటింగ్​ పాఠాలు

ABOUT THE AUTHOR

...view details