ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో మార్మోగుతున్న పేర్లలో యశ్ ఒకటి. ఎవరూ పెద్దగా పట్టించుకోని కన్నడ సినిమా ఇండస్ట్రీని 'కేజీఎఫ్'తో ఒక్కసారిగా ప్రపంచ సినిమాకు పరిచయం చేశారు. డైరెక్టర్ ప్రశాంత్‌నీల్, హీరో యష్ కాంబినేషన్‌లో 'కేజీఎఫ్2' సైతం ఇటీవల చిత్రీకరణ పూర్తి అయ్యింది. అయితే.. దొరికిన కాస్త ఖాళీ సమయాన్ని కుటుంబంతో గడిపేందుకు ఈ కన్నడ రాకింగ్ స్టార్ నిర్ణయించుకున్నారు.
మాల్దీవుల విహారయాత్రలో రాకీభాయ్ - మాల్దీవుల్లో యశ్
రాకింగ్ స్టార్ యశ్.. ఇటీవలే కుటుంబ సమేతంగా విహారయాత్ర కోసం మాల్దీవులకు చేరుకున్నారు. ఇటీవలే 'కేజీఎఫ్' షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ హీరో.. తన భార్య, పిల్లలతో సరదాగా గడపడానికి మల్దీవులకు వెళ్లారు. దానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
మాల్దీవుల విహారయాత్రలో రాకీభాయ్
అందుకే సినిమా పూర్తి కాగానే.. తర్వాతి సినిమా పట్టాలెక్కించకముందే కుటుంబంతో మాల్దీవులకు పయనమయ్యారు. భార్య రాధికా పండిట్, ఇద్దరు పిల్లలతో కలిసి అక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇటీవల ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'సలార్' ప్రారంభ వేడుకలో యశ్ పాల్గొని సందడి చేశారు.
ఇదీ చూడండి:బయోపిక్స్‌లో నటించడం ఆషామాషీ కాదు: ఊర్వశి