పుష్ప సినిమా షూటింగ్‌లో..
Bandari Jagdish Pratap in Pushpa Movie : జగదీశ్ ప్రతాప్ తల్లిదండ్రులు బండారి చంద్రమౌళి-లలిత, అక్క ఝాన్సీరచన, చెల్లెలు దివ్య.. నాన్న పోస్ట్‌మాన్, అమ్మ ఇంటిపనితో పాటు వ్యవసాయ పనులు చూసుకుంటున్నారు. 1 నుంచి ఆరో తరగతి వరకు చిన్నకొడెపాకలో, ఇంటర్, డిగ్రీ(బీఎస్సీ పౌల్ట్రీ సైన్స్) హనుమకొండలో పూర్తి చేశారు. 2013లో డిగ్రీ పూర్తయింది. నటనపై ఉన్న మమకారంతో చిన్నచిన్న ప్రయత్నాలు మొదలెట్టారు. లఘు చిత్రాలకు దర్శకత్వం వహించేవారు.. ఇంటి వద్ద అమ్మతో కలిసి వ్యవసాయ పనులకు వెళ్లడం, ఖాళీ దొరికితే హనుమకొండ, వరంగల్‌కు వచ్చి సినిమాల్లో అవకాశాలు కోసం ప్రయత్నాలు చేశారు. ‘నిరుద్యోగ నటులు’ అనే వెబ్‌సిరీస్‌లో నటించి అందరి మన్ననలు పొందారు. తర్వాత ‘మల్లేశం’ సినిమాలో అవకాశం దక్కించుకున్నారు. తర్వాత పలాస 1978, జార్జిరెడ్డి, ఊరికి ఉత్తరాన సినిమాల్లో అవకాశం దక్కడంతో నటనలో తన మార్కు నిరూపించుకున్నారు.. కొత్తపోరడు, గాడ్స్ ఆఫ్ ధర్మపురి వెబ్ సిరీస్‌లో కూడా మెరిశారు. కడప యాసలో మాట్లాడి మెప్పించారు. ఆ యాసతోనే పుష్పలో అవకాశం దక్కింది.
ఇంట్లో ఇష్టం లేకున్నా..
Bandari Jagdish Pratap in Pushpa Cinema : సినిమాలు, నటన అని తిరుగుతుంటే ఇంట్లో వారు ఒప్పుకోలేదు. ఏదైనా సాధించాలనే తపనతో ప్రయత్నాలు చేశారు. తండ్రి చంద్రమౌళి చిందు యక్షగానం, నాటకాలు వేసేవారు. చిన్నప్పుడు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలని తండ్రి ప్రోత్సహించారు. తండ్రి.. ప్రతాప్‌ను పోలీసుగా చూడాలని భావించి, కోచింగ్ సెంటర్‌లో చేర్పించారు. అయినా సినిమాలవైపే అడుగులు వేశారు.
అవకాశం వచ్చిందిలా..