'మహానటి'తో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు పొందిన కీర్తి సురేశ్.. ఇప్పుడు 'మిస్ ఇండియా'గా మారింది. ఈ టైటిల్‌తో వస్తున్న సినిమాకు సంబంధించిన టీజర్‌ను సోమవారం విడుదల చేసింది చిత్రబృందం. విభిన్న రూపాల్లో కనిపిస్తూ అభిమానుల్లో చిత్రంపై అంచనాలను పెంచుతోంది కీర్తి.
'మహానటి' నుంచి 'మిస్ ఇండియా'గా కీర్తి సురేశ్ - miss india cinema
హీరోయిన్ కీర్తి సురేశ్ కొత్త సినిమాకు 'మిస్ ఇండియా' అనే టైటిల్ ఖరారు చేస్తూ ఓ టీజర్‌ను విడుదల చేశారు.
హీరోయిన్ కీర్తి సురేశ్
జగపతిబాబు, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను ఎక్కువ భాగం స్పెయిన్‌లోనే చిత్రీకరించారు. తమన్ సంగీతమందిస్తున్నాడు. నరేంద్రనాథ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మహేశ్ కోనేరు నిర్మాత. ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది చదవండి: ఈ అవార్డు అమ్మకు అంకితమిస్తున్నా: కీర్తి సురేశ్
Last Updated : Sep 28, 2019, 8:24 AM IST