తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కన్నడలో అడుగుపెట్టనున్న కీర్తి సురేష్‌..? - keerti suresh

జాతీయ అవార్డు నటి పొందిన కీర్తి సురేష్ త్వరలో ఓ కన్నడ సినిమాలో నటించనుందని సమాచారం. ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.

కీర్తి

By

Published : Sep 7, 2019, 5:47 AM IST

Updated : Sep 29, 2019, 5:49 PM IST

'మహానటి' చిత్రంలో సావిత్రిగా నటించిన కీర్తి సురేష్‌ ఇప్పుడు యావత్‌ భారతదేశంలో ప్రముఖ నటిగా మారింది. ఈ మధ్యనే జాతీయ అవార్డూ అందుకుంది. దక్షిణాదిలో ఒక కన్నడలో తప్ప మలయాళ, తమిళ, తెలుగు భాషల్లో నటించింది. ఇప్పుడు కన్నడలోనూ తొలిసారిగా 'మదగజ' అనే చిత్రం ద్వారా పరిచయం కానుందని సమాచారం.

ఈ సినిమాలో హీరోగా శ్రీ మురళి నటిస్తున్నాడు. అయితే ఈ వార్త ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం కీర్తి 'మిస్‌ ఇండియా' చిత్రంతో బిజీగా ఉంది. ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.

బాలీవుడ్‌లో అజయ్‌ దేవగణ్‌ సరసన 'మైదాన్' అనే చిత్రంలోనూ నటిస్తోంది కీర్తి. ఇది క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతోంది. మలయాళంలోనూ ప్రియదర్శన్‌ దర్శకత్వంలో 'మరక్కర్: అరబికడలింటే సింహం'లో మోహన్‌ లాల్‌తో కలిసి నటిస్తోంది.


ఇవీ చూడండి.. చంద్రయాన్​-2 బడ్జెట్​ ఈ సినిమాల కన్నా తక్కువే!

Last Updated : Sep 29, 2019, 5:49 PM IST

ABOUT THE AUTHOR

...view details