నాగార్జున హీరోగా రూపొందిన చిత్రం సోగ్గాడే చిన్నినాయనా. ఈ సినిమాకు సీక్వెల్‌గా బంగర్రాజు తెరకెక్కబోతుంది. ఇందులో నాగచైతన్య కీలకపాత్రలో నటించనున్నాడు. తాజాగా చైతన్య సరసన కీర్తి సురేష్ నటించనున్నట్టు సమాచారం. చిత్రబృందం ఆమెతో ఈ విషయంపై సంప్రదింపులు జరుపుతోంది.
నాగచైతన్యతో రెండో సారి నటించనున్న కీర్తి! - keerthi
మహానటిలో కొద్దిసేపు కలిసి నటించిన నాగచైతన్య, కీర్తీ సురేష్ మరోసారి తెరపంచుకోబోతున్నట్టు సమాచారం. సోగ్గాడే చిన్నినాయనా చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కనున్న బంగర్రాజులో నటించేందుకు కీర్తితో సంప్రదింపులు జరిపుతోంది చిత్రబృందం.
మొదటి భాగన్ని తెరకెక్కించిన కల్యాణ్‌కృష్ణ కురసాల బంగర్రాజు చిత్రాన్ని తీయనున్నాడు. ఇప్పటికే స్క్రిప్టు వర్క్ పుర్తిచేశాడు. వచ్చే సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం యోచిస్తున్నట్టు సమాచారం.
ఇప్పటికే మహానటి చిత్రంలో ఇద్దరూ(నాగచైతన్య, కీర్తి) కలిసి నటించారు. అందులో చైతన్య.. అక్కినేని నాగేశ్వరరావు పాత్రను పోషించాడు. ఒకవేళ కీర్తిసురేష్ బంగర్రాజు చిత్రంలో నటించేందుకు ఆసక్తి చూపిస్తే వీరిద్దరి కాంబో మరోసారి చూడొచ్చు. ప్రస్తుతం మన్మథుడు 2లో నటిస్తోంది కీర్తి.