పవన్‌కల్యాణ్ - క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి స్వరాలు సమకూర్చనున్నట్లు సమాచారం. 'పింక్' రీమేక్ పూర్తవకముందే పవన్.. క్రిష్ దర్శకత్వంలో తదుపరి చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. ఇది ఖరారైతే పవన్, కీరవాణి కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రమవుతుంది.
పవర్‌స్టార్ కొత్త సినిమాకు కీరవాణి సంగీతం..! - Krish
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కొత్త సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. క్రిష్ దర్శకత్వం వహించే ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుంది.
పవర్‌స్టార్ కొత్త సినిమాకు కీరవాణి సంగీతం
గతంలో క్రిష్ దర్శకత్వం వహించిన 'వేదం', 'ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు' చిత్రాలకు కీరవాణి స్వరాలు అందించాడు. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలకు అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకరు ప్రగ్యా జైస్వాల్ అని మరొక కథానాయికను వెతికే పనిలో చిత్రబృందం ఉందని టాక్. ఈ నెల 29 నుంచి చిత్రీకరణ ప్రారంభమవుతుందని వార్తలొస్తున్నాయి. వీటిలో ఎంత నిజం ఉందో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.
ఇదీ చూడండి... పింక్ రీమేక్ కోసం పవర్‌స్టార్‌కు ప్రత్యేక విమానం
Last Updated : Feb 28, 2020, 5:38 AM IST