తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ముంబయిలో అదిరిన హాలీవుడ్‌ గాయనుల సందడి - పాప్‌స్టార్‌ కెటీ పెర్రీ

ముంబయి వేదికగా శనివారం జరిగిన సంగీత విభావరిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది హాలీవుడ్‌ పాప్‌ గాయని కెటీ పెర్రీ. ఈ వేడుకలో పాటలతో అభిమానులను ఉర్రూతలూగించింది. 2012 ఐపీఎల్​ ప్రారంభోత్సవ వేడుక తర్వాత 7 ఏళ్లకు ఈ గాయని భారత్​లో మళ్లీ ప్రదర్శన ఇచ్చింది.

హాలీవుడ్‌ గాయనుల సందడి... ముంబయిలో అట్టహాసంగా వేడుక

By

Published : Nov 17, 2019, 10:19 PM IST

హాలీవుడ్‌ పాప్‌స్టార్‌ కెటీ పెర్రీ... ముంబయిలో ఇచ్చిన తొలి సంగీత విభావరి అద్భుతంగా జరిగింది. శనివారం రాత్రి డీవై పాటిల్‌ స్టేడియంలో ఈ వేడుక అట్టహాసంగా జరిగింది. 'ప్రింటెడ్‌ ఆఫ్‌ షోల్డర్‌ జంప్‌' సూట్‌లో మెరిసిందీ ప్రముఖ గాయని. తన ఆల్బమ్‌లోని పాపులర్‌ గీతాల్ని పాడి అభిమానులను అలరించింది. 'లాస్ట్‌ ఫ్రయిడే నైట్‌', 'సూపర్‌ నేచురల్‌', 'ఐ కిస్‌ ఎ గర్ల్‌', 'రోర్‌ అండ్‌ ఫైర్‌ వర్క్‌'.. వంటి హిట్‌ సాంగ్స్‌తో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది.

కెటీ పెర్రీ
మిరుమిట్లు గొలిపే కాంతుల్లో డీవై పాటిల్​ స్టేడియం

ఈ సందర్భంగా తీసిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ మారాయి. ఇదే సంగీత విభావరిలో మరో పాపులర్‌ సింగర్‌ డువా లిపా కూడా ప్రదర్శన ఇచ్చింది. రెండు రోజుల క్రితమే ముంబయికి వచ్చిన కెటీ, డువా... పలువురు సినీ ప్రముఖుల్ని కలిసింది.

చెన్నైవేదికగా 2012 జరిగిన ఐపీఎల్​ ఆరంభోత్సవానికి హాజరైన పెర్రీ... తనదైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆ వేడుకలో బాలీవుడ్​ హీరో సల్మాన్​ఖాన్​, ప్రియాంక చోప్రా, అమితాబ్​ బచ్చన్​తో కలిసి డ్యాన్స్​ చేసింది. ఆ తర్వాత మళ్లీ 7 ఏళ్లకు ముంబయిలో ప్రదర్శన కోసం భారత్​కు వచ్చింది.

ABOUT THE AUTHOR

...view details