బాలీవుడ్ యువ నటుడు కార్తిక్ ఆర్యన్.. అజయ్ భల్ దర్శకత్వంలో 'ఫ్రెడ్డీ' అనే చిత్రం చేస్తున్నాడు. ఇందులో కథానాయికగా కత్రినా కైఫ్ నటించనుందని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే చిత్రబృందం కత్రినను సంప్రదించిందట. అందుకు ఆమె అంగీకారం కూడా తెలిపిందని తెలుస్తోంది. అయితే అధికారికంగా ఎక్కడా ఈ వార్తను ప్రకటించలేదు. ఇదే నిజమైతే కార్తిక్ ఆర్యన్-కత్రినా కైఫ్‌లు కలిసి నటించనున్న మొదటి ఇదే చిత్రం అవుతుంది.
కార్తిక్ ఆర్యన్‌తో కత్రినా కైఫ్ రొమాన్స్? - కత్రినా కైఫ్ కార్తీక్ ఆర్యన్ కొత్త చిత్రం
బాలీవుడ్లో మరో కొత్త జోడీ కనువిందు చేయనుందని సమాచారం. అజయ్ భల్ దర్శకత్వంలో కార్తిక్ ఆర్యన్ హీరోగా వస్తున్న 'ఫ్రెడ్డీ' చిత్రంలో కత్రినా కైఫ్ హీరోయిన్గా ఎంపికైందని తెలుస్తోంది.
కార్తీక్ ఆర్యన్‌తో కత్రినా కైఫ్?
ప్రస్తుతం కత్రిన పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఆమె నటిస్తున్న 'ఫోన్ బూత్', 'టైగర్ 3' చిత్రాలు పూర్తి చేసిన తరువాత 'సూపర్ సోల్జర్'ని సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉంది. అలాగే కార్తిక్ ప్రస్తుతం 'భూల్ భులయ్యా 2', 'దోస్తానా 2' చిత్రాల్లో నటిస్తున్నాడు. తర్వాత రోహిత్ ధావన్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురములో' రీమేక్ చిత్రంలో హీరోగా చేయనున్నాడు.