Kartik Aaryan House: బాలీవుడ్ యువ హీరో కార్తీక్ ఆర్యన్ ఇంటి ముందు ఇద్దరు అమ్మాయిలు హల్చల్ చేశారు. ఆయనపై ఉన్న వీరాభిమానాన్ని చాటుకున్నారు. ముంబయిలోని తన ఇంటి ముందు నిలబడి.. 'కార్తీక్ దయచేసి బయటికి రా' అంటూ బిగ్గరగా కేకలు వేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. కొద్ది సేపటికే కార్తీక్ తన ఇంటి బయటకు వచ్చి అభిమానులతో ఫొటోలు దిగారు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
అత్యుత్సాహం ప్రదర్శించిన యువతులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ నెటిజన్.. 'మీకు ఆత్మాభిమానం లేదా?' అని కామెంట్ చేశాడు. మరో నెటిజన్.. 'ఈ డెడికేషన్ ఏదో కుటుంబ సభ్యులపై చూపించాలి' అని కామెంట్ పెట్టాడు.
కాగా, ఆర్యన్ ప్రస్తుతం 'షాహ్జాదా' సినిమాలో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన 'అల వైకుంఠపురములో' సినిమాకు రీమేక్‌గా ఇది తెరకెక్కుతోంది. కార్తీక్ నటించిన 'ధమాకా' చిత్రం ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై మంచి పేరు తెచ్చుకుంది. 'ఫ్రెడ్డీ' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.