తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పంచెకట్టులో ఆకట్టుకుంటున్న ఆర్​ఎక్స్​100 హీరో - karthikeya

ఆర్​ ఎక్స్​ 100 ఫేమ్ కార్తికేయ తాజా చిత్రం 'గుణ 369' ఫస్ట్​లుక్ నేడు విడుదలైంది. అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మాతలు. అర్జున్ జంధ్యాల దర్శకుడు.

కార్తీకేయ

By

Published : May 29, 2019, 2:49 PM IST

ఆర్‌ ఎక్స్ 100తో గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ హీరోగా రూపొందుతోన్న చిత్రం `గుణ 369`. తాజాగా ఇవాళ ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి నిర్మాతలు. అర్జున్‌ జంధ్యాల దర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.

పంచెకట్టులో హీరో కార్తికేయ లుక్​ ఆకట్టుకునేలా ఉంది. చైతన్య భరద్వాజ ఈ సినిమాకు సంగీతమందిస్తున్నారు.

ఇటీవల ఒంగోలులో భారీ షెడ్యూల్​తో షూటింగ్ మొత్తం పూర్తయిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయని దర్శకుడు అర్జున్ తెలిపారు. ఫస్ట్​లుక్​లో కార్తికేయ ఆకట్టుకుంటున్నాడని, సినిమా బాగా వస్తోందని నిర్మాతలు అనిల్ కడియాల, తిరుమల్​ రెడ్డి చెప్పారు.

పంచెకట్టులో కార్తికేయ

ABOUT THE AUTHOR

...view details